మెగా మాతృమూర్తి అంజనాదేవికి ప్రతిష్టాత్మక 'బాపు బొమ్మ' పురస్కారం!
Bapu Bomma Viswa Mahila Awards: తెలుగువారి ‘బాపు బొమ్మ’గా గుర్తింపు పొందిన ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు దివ్యవాణి చౌదరి ఆధ్వర్యంలో ‘బాపు బొమ్మ - విశ్వ మహిళ’ అవార్డుల వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
మెగా మాతృమూర్తి అంజనాదేవికి ప్రతిష్టాత్మక 'బాపు బొమ్మ' పురస్కారం!
Bapu Bomma Viswa Mahila Awards: తెలుగువారి ‘బాపు బొమ్మ’గా గుర్తింపు పొందిన ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు దివ్యవాణి చౌదరి ఆధ్వర్యంలో ‘బాపు బొమ్మ - విశ్వ మహిళ’ అవార్డుల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (2026) సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామణులను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలతో సత్కరించారు.
హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ‘తెలుగు వన్’ అధినేత కంఠంనేని రవిశంకర్, నటుడు హర్షవర్ధన్, ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులు అతిథులుగా విచ్చేసి విజేతలను అభినందించారు.
పురస్కార గ్రహీతలు వీరే:
మెగా మాతృమూర్తి శ్రీమతి కొణిదెల అంజనీదేవి గారితో ఈ అవార్డుల ప్రదానోత్సవం శ్రీకారం చుట్టడం విశేషం. వీరితో పాటు:
శ్రీమతి శ్యామలాదేవి (రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి)
యాంకర్ స్వప్న
డాక్టర్ వెన్నెల గద్దర్
జనేతా కంచర్ల (USA)
డి. జ్యోతిరెడ్డి (USA)
డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి తదితరులు ఈ పురస్కారాలను అందుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేలా ప్రణాళిక:
ఈ సందర్భంగా దివ్యవాణి మాట్లాడుతూ.. సమాజంలోని మహిళల్లో స్ఫూర్తిని రగిలించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఈ అవార్డుల వేడుకను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ, విదేశాల్లోనూ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
మెగా మాతృమూర్తి అంజనీదేవి గారికి తొలి పురస్కారం అందజేయడంపై వక్తలు హర్షం వ్యక్తం చేస్తూ, మహిళల ప్రతిభను గుర్తించడంలో దివ్యవాణి తీసుకున్న చొరవను కొనియాడారు.