Hansika Motwani Divorce: విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్

Hansika Motwani Divorce: స్టార్ హీరోయిన్ హన్సికా మొత్వాని విడాకుల వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భర్త సోహైల్ కతూరియా నుంచి హన్సిక అధికారికంగా విడిపోయారు. వీరి వివాహ బంధం ఎందుకు ముగిసింది? విడాకులకు గల కారణాలు, హన్సిక తదుపరి ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.

Update: 2026-03-11 14:08 GMT

Hansika Motwani Divorce: విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్

Hansika Motwani Divorce: టాలీవుడ్ 'దేశముదురు' భామ హన్సికా మొత్వాని తన భర్త సోహైల్ కతూరియా నుంచి విడిపోయారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతుండగా, తాజాగా వీరు విడాకులు తీసుకున్నారు. హన్సిక తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్ కతూరియాను 2022లో వివాహం చేసుకుంది. జైపూర్‌లోని ముండోటా కోటలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అయితే, పెళ్లి జరిగిన రెండేళ్లకే వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని, గతేడాది కాలంగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారని టాక్ వినిపించింది. తాజాగా వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.

సోహైల్ కతూరియాకు ఇది రెండో వివాహం. అంతకుముందు సోహైల్‌కు రింకీ బజాజ్ అనే యువతితో పెళ్లి జరిగింది. విశేషమేమిటంటే, సోహైల్ మొదటి పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. ఆ తర్వాత సోహైల్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం, హన్సికతో ప్రేమలో పడటం చకచకా జరిగిపోయాయి. అప్పట్లో ఈ విషయంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తమిళ ఇండస్ట్రీలో కూడా ఆమె మంచి క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు, ఇప్పుడు విడాకుల వార్తతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం హన్సిక మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండాలని ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News