హల్దీ కాదు.. ఇది హోలీ! రంగుల్లో మునిగిపోయిన విజయ్ - రష్మిక.. ఫోటోలు వైరల్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల హల్దీ వేడుక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనామిక ఖన్నా డిజైన్ చేసిన దుస్తుల్లో ఈ జంట మెరిసిపోయింది.
హల్దీ కాదు.. ఇది హోలీ! రంగుల్లో మునిగిపోయిన విజయ్ - రష్మిక.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి వేడుకల్లో ఫ్యాషన్ పరంగా సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు. తాజాగా వీరి హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి వైరల్‌గా మారాయి. ఈ వేడుక కోసం ఈ జంట సెలబ్రిటీ డిజైనర్ అనామిక ఖన్నా డిజైన్ చేసిన దుస్తులను ఎంచుకున్నారు. నూతన జంట జీవితాల్లో కొత్త ప్రయాణం ఆనందంగా, ఉత్సాహంగా సాగాలనే థీమ్‌తో ఈ దుస్తులను రూపొందించినట్లు డిజైనర్ తెలిపారు.
వసంత కోకిలలా రష్మిక..
హల్దీ వేడుకలో రష్మిక లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రీన్ కలర్ సింగిల్ షోల్డర్ కేప్ టాప్, దానికి మ్యాచింగ్ స్కర్ట్‌తో రష్మిక మెరిసిపోయింది. వసంత కాలాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ డ్రెస్‌పై ఉన్న ఫ్లోరల్ మోటిఫ్స్ పండుగ వాతావరణాన్ని తెచ్చాయి. రష్మికకు స్టేట్‌మెంట్ జ్యువెలరీ అంటే మక్కువ. ఈ వేడుకలో ఆమె ధరించిన పెద్ద ఇయర్ రింగ్స్, మాంగ్ టిక్కా హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఆమె చేతికి ఉన్న గోల్డ్ 'కడ' (గాజులు) స్టాక్ అందరి దృష్టిని ఆకర్షించింది.
క్లాసీ లుక్‌లో విజయ్ దేవరకొండ..
ప్రతి వేడుకలోనూ ప్రయోగాత్మక దుస్తులతో ఆకట్టుకుంటున్న విజయ్, హల్దీ కోసం కాస్త సింపుల్ అండ్ క్లాసీ లుక్‌ను ఎంచుకున్నారు. తన హల్దీ వేడుకలకు విజయ్ బ్లష్ పింక్ పాస్టెల్ కుర్తా సెట్‌ను ధరించారు. దీనిపై ఉన్న పూలు, తీగలతో కూడిన ఎంబ్రాయిడరీ వర్క్ అతడికి రాయల్ లుక్‌ను ఇచ్చింది. యాక్సెసరీస్ కోసం కేవలం గోల్డ్ టచ్ ఇచ్చి ఎప్పటిలాగే స్టైలిష్‌గా కనిపించారు. ఈ వేడుక గురించి రష్మిక స్పందిస్తూ.. "ఇది హల్దీ లాగా కాకుండా హోలీ వేడుకలా జరిగింది. రంగుల్లో ఎంతలా మునిగిపోయామంటే.. ఇప్పటికీ నా జుట్టులో అక్కడక్కడ ఎరుపు రంగు కనిపిస్తోంది" అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. విజయ్ తన ప్రయోగాత్మక స్టైల్స్‌తో మార్కులు కొట్టేస్తుంటే, రష్మిక తన వెడ్డింగ్ చీర, రిసెప్షన్ మైసూర్ సిల్క్ డ్రేప్, సంగీత్ డ్రెస్‌లతో ఈ ఏడాది 'బెస్ట్ సెలబ్రిటీ బ్రైడ్'గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ హల్దీ వేడుకలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై విజయ్-రష్మికల ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.