Dhurandhar 2: నేడే ‘ధురంధర్ 2’ మ్యూజిక్ లాంచ్.. ఫ్యాన్స్‌కు ఎంట్రీ ఫ్రీ.. ఎక్కడ? ఎలా అంటే?
Dhurandhar 2: రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) గ్రాండ్ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ నేడు ముంబైలోని నెస్కో సెంటర్‌లో జరగనుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, మాధవన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా మ్యూజిక్ ఫెస్టివల్ వివరాలు ఈ స్టోరీలో చూడండి.
Dhurandhar 2: నేడే ‘ధురంధర్ 2’ మ్యూజిక్ లాంచ్.. ఫ్యాన్స్‌కు ఎంట్రీ ఫ్రీ.. ఎక్కడ? ఎలా అంటే?
'ధురంధర్: ది రివెంజ్' గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు కేవలం ఒక రోజు ముందు చిత్ర నిర్మాతలు మార్చి 17న(మంగళవారం) ముంబైలో భారీ స్థాయిలో మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు హాజరవుతారని సమాచారం. 'ధురంధర్: ది రివెంజ్' మ్యూజిక్ ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఈరోజు గోరేగావ్‌లోని నెస్కో సెంటర్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి సుమారు 2,500 నుంచి 3,000 మంది హాజరవుతారని అంచనా.
అడ్వాన్స్ బుకింగ్‌లో జోరు..
ఈ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను స్పాటిఫై సమర్పిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అభిమానులకు ప్రవేశం ఉచితం, అయితే హాజరయ్యేవారు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ కార్యక్రమం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెంట్ ఎంట్రీ డోర్స్ ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు తెరుచుకుంటాయి. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో రణవీర్ సింగ్, సంగీత దర్శకుడు శశ్వత్ సచ్‌దేవ్‌తో పాటు చిత్ర బృందం, సంగీత బృందంలోని సభ్యులు హాజరవుతారని సమాచారం. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు, సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, సారా అర్జున్, డానిష్ పాండోర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. గతంలో రిలీజ్ అయిన ధురంధర్ బాలీవుడ్‌లో ఎంతటి సక్సెస్‌ను అందుకుందో తెలిసిందే. ఎన్నో ఏళ్లు తీరని ఆకలితో ఎదరుచూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ ఆకలిని ఈ చిత్రం తీర్చింది. తాజాగా రిలీజ్‌కు సిద్ధం అవుతున్న ధురంధర్ 2 చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.