Gopichand: మళ్ళీ పట్టాలెక్కిన గోపీచంద్ యాక్షన్ ఎంటర్టైనర్!

Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్-కుమార సాయి కాంబినేషన్‌లో ఆగిపోయిన భారీ యాక్షన్ చిత్రం మళ్ళీ ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి లండన్‌లో జరగనున్న రెండు నెలల సుదీర్ఘ షెడ్యూల్, సినిమా విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్స్.

Update: 2026-03-17 15:48 GMT

Gopichand: మళ్ళీ పట్టాలెక్కిన గోపీచంద్ యాక్షన్ ఎంటర్టైనర్!

Gopichand: టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే సంకల్ప్ రెడ్డి సినిమాతో బిజీగా ఉన్న ఆయన, తాజాగా మరో భారీ ప్రాజెక్టును మళ్ళీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. యువ దర్శకుడు కుమార సాయి దర్శకత్వంలో గోపీచంద్ ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు 2025లోనే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.


శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమా, కొన్ని అనివార్య ఆర్థిక కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. అయితే, తాజాగా నిర్మాతలకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో ఈ సినిమాను పునఃప్రారంభించేందుకు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇదే నిర్మాణ సంస్థలో నాగచైతన్య హీరోగా వస్తున్న ‘వృషకర్మ’ షూటింగ్ పూర్తవడంతో, ఇప్పుడు ప్రొడక్షన్ టీమ్ మొత్తం గోపీచంద్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టిందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

తాజా అప్‌డేట్ ప్రకారం.. చిత్ర యూనిట్ లండన్ ప్రయాణానికి సర్వం సిద్ధం చేసిందని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి లండన్‌లో దాదాపు రెండు నెలల పాటు సుదీర్ఘ షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేశారని, ఇందులో ప్రధాన తారాగణం అంతా పాల్గొనే ఈ అవకాశం ఉందని సమాచారం.


ఈ షెడ్యూల్‌తో సినిమాలోని కీలక సన్నివేశాలు, టాకీ పార్ట్ దాదాపుగా పూర్తికానుందని తెలుస్తుంది. విదేశాల్లో జరిగే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని ప్రచారం జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 ప్రథమార్ధంలో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags:    

Similar News