Chiranjeevi New Movie: 'మెగాస్టార్' చిరంజీవి నెక్స్ట్ మూవీ.. మాస్ స్క్రిప్ట్, వింటేజ్ లుక్!
Chiranjeevi New Movie: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్ల నేపథ్యంలో హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టుల గురించి కీలక విషయాలను వెల్లడించారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఖచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
Chiranjeevi New Movie: 'మెగాస్టార్' చిరంజీవి నెక్స్ట్ మూవీ.. మాస్ స్క్రిప్ట్, వింటేజ్ లుక్!
Chiranjeevi New Movie: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఇండస్ట్రీ హిట్ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. ఎస్ఎస్ థమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లబోతున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఉస్తాద్ చిత్రం.. ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగాస్టార్‌తో తదుపరి ప్రాజెక్ట్:
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్ల నేపథ్యంలో హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టుల గురించి కీలక విషయాలను వెల్లడించారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఖచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే కార్యరూపం దాల్చబోతోందని, మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక పక్కా మాస్ కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్:
ఈ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పిన ఒక విషయం మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చిరంజీవి ఆల్-టైమ్ క్లాసిక్స్ అయిన 'రౌడీ అల్లుడు', 'గ్యాంగ్ లీడర్' చిత్రాల్లోని మాస్ మ్యానరిజమ్స్, గ్రేస్ ఈ సినిమాలో కనిపిస్తాయని హరీష్ శంకర్ వెల్లడించారు. చిరంజీవిని మరలా వింటేజ్ లుక్‌లో చూడాలనుకునే అభిమానుల కోరికను ఈ సినిమా తీరుస్తుందని హరీష్ ధీమా వ్యక్తం చేశారు.
'ఉస్తాద్' రిజల్ట్‌పైనే ఫోకస్:
అన్నీ అనుకున్నట్లు జరిగితే హరీష్ శంకర్, చిరంజీవి భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అయితే, మెగాస్టార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే.. హరీష్ శంకర్ ముందుగా 'ఉస్తాద్ భగత్ సింగ్'తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టడం అత్యవసరం. పవన్ కళ్యాణ్ సినిమా రిజల్ట్‌పైనే హరీష్ తదుపరి క్రేజీ ప్రాజెక్ట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.