వైరల్ : 'కత్తి'లా చరణ్ కొత్త లుక్!
Ram Charan New Look : సోషల్ మీడియాలోకి అడుగు పెట్టాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.. ఎప్పటికప్పుడు
Ramcharan
Ram Charan New Look : సోషల్ మీడియాలోకి అడుగు పెట్టాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.. ఎప్పటికప్పుడు ఎదో కొత్త విషయంతో అభిమానులను సప్ రైజ్ చేస్తున్నాడు.. లేటెస్ట్ గా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. 'ఎప్పుడూ మీ బెస్ట్ కోసం ప్రయత్నించండి' అనే క్యాప్షన్ యాడ్ చేశాడు. సైడ్ యాంగిల్‌లో చురకత్తుల్లాంటి చూపు, కోర మీసాలతో ఉన్న ఈ ఫొటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అటు చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తుండగా, 'చరణ్.. సూపర్' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.. ఇందులో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలు పెరిగాయి.