Ram Charan In Acharya : మెగాస్టార్ 'ఆచార్య'లో రామ్ చరణ్!

Ram Charan In Acharya : మెగాస్టార్ ఆచార్యలో రామ్ చరణ్!
x

Ram Charan 

Highlights

Ram Charan In Acharya : మెగా అభిమానులకి శుభవార్తను అందజేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. తన తండ్రి మెగాస్టార్

Ram Charan In Acharya : మెగా అభిమానులకి శుభవార్తను అందజేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో తానూ నటిస్తున్నట్టుగా అధికారికంగా వెల్లడించాడు. " నేను నాన్న కలిసి తెరపై పూర్తి స్థాయిలో కనిపించాలని మా అమ్మ కల.. ఆచార్యలో మా కాంబినేషన్ అలరిస్తుందని నమ్ముతున్నా.. 2015లో నేను నటించిన బ్రూస్ లీ చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. ఖైది నెంబర్ 150లో నేను నాన్నతో కలిసి డాన్స్ చేశా. ఇప్పుడు మళ్ళీ ఆచార్యలో కలిసి నటిస్తున్నాం" అని చరణ్ ఓ అంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.. అయితే గత కొద్ది రోజుల నుంచి చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..

కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతుంది. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. త్వరలోనే సినిమా మళ్ళీ పట్టాలేక్కనుంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. అటు రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో నటిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories