Ram Charan : చరణ్ ఈ సస్పెన్స్ కి తెర దించు..

Ram Charan : చరణ్ ఈ సస్పెన్స్ కి తెర దించు..
x

ram charan

Highlights

Ram Charan : ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో

Ram Charan : ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలు పెరిగాయి.

అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా పైన క్లారిటీ ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నాడు ఎన్టీఆర్.. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా.. అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేయబోయే సినిమా పైన ఇంకా క్లారిటీ రాలేదు.. గత ఆరు నెలల కాలంలో పది మంది దర్శకుల పేర్లు వినిపించాయి. అందులో అందరు స్టార్ డైరెక్టర్ లు ఉండడం విశేషం.. అయితే చరణ్ వంశీ పైడిపల్లి కథకి ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. మహేష్ తో అనుకున్న కథను చరణ్ తో చేయాలనీ అనుకుంటున్నాడని సమాచారం.. మొత్తానికి అయితే మెగా ఫ్యాన్స్ చెర్రి తదుపరి చిత్రం ఏంటో తెలియక సతమతం అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories