Conductor Jhansi: చైతన్య సూసైడ్ కు ఇదే కారణం.. సంచలన నిజాలు బయటపెట్టిన కండక్టర్ ఝాన్సీ..
Conductor Jhansi: ఢీ షోతో గుర్తింపు తెచ్చుకున్న డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్యతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Conductor Jhansi: చైతన్య సూసైడ్ కు ఇదే కారణం.. సంచలన నిజాలు బయటపెట్టిన కండక్టర్ ఝాన్సీ..
Conductor Jhansi: ఢీ షోతో గుర్తింపు తెచ్చుకున్న డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్యతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన ఆత్మహత్య ఉదంతం చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. చైతన్య నెల్లూరులోని ఓ హోటల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అప్పుల బాధ భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చైతన్య తన సెల్ఫీ వీడియోలో చెప్పాడు. సెల్పీ వీడియోలో చైతన్య మాస్టర్ తన తల్లిదండ్రులకు, తోటి డాన్స్ మాస్టర్లకు, డాన్సర్లకు క్షమాపణ చెప్పాడు. అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని..అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని తెలిపాడు.
చైతన్య ఆత్మహత్య పై కండక్టర్ ఝాన్సీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గత ఏడాది డిసెంబర్ 31న కండెక్ట్ చేసిన ప్రోగ్రాంలో కొంతమంది ఆర్టిస్టులు చైతన్యకు హ్యాండిచ్చారని దీంతో ఈవెంట్ ఆర్గనైజర్స్ మాస్టర్ కు రావాల్సిన అమౌంట్ ను ఆపేశారని దాని వల్ల ఆయన అప్పు చేశారని..దాన్ని తీర్చేందుకు మరో అప్పు..ఇలా అప్పులు చేసుకుంటూ పోయారని చివరకు ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారంటూ కండక్టర్ ఝాన్సీ కన్నీళ్ల పర్యాంతం అయింది. ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆ ఆర్టిస్టులతో కూర్చొని మాట్లాడి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఝాన్సీ అభిప్రాయపడింది. మొత్తానికి, ఝాన్సీ చేసిన వ్యాఖ్యలతో చైతన్య సూసైడ్ వెనుక అసలు కారణాలు బయటపడ్డాయి.