త్వరలో చిరు 152 వ సినిమా అధికారిక ప్రకటన

'ఖైదీనెంబర్150' తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు.

Update: 2019-01-02 11:00 GMT
Chiranjeevi

'ఖైదీనెంబర్150' తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా మొట్ట మొదటి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమా తర్వాతన్ చిరు స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారని తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి పండుగ తరువాత ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది.

అప్పుడే ఈ సినిమా తాలూకు వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ షూటింగ్ మాత్రం ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. 'సైరా నరసింహారెడ్డి' ఈ సంవత్సరంలో వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత మాత్రమే చిరు కొరటాల శివ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తారని తెలుస్తోంది. ఇదిలావుండగా ఈ మధ్యనే 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాను ప్రముఖ ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య, డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు.

Similar News