Bigg Boss 4 Telugu Contestants List Viral : బిగ్ బాస్ 4 లో హౌస్ క్వారంటైన్..పదిహేను రోజుల ముందుగానే కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ కి!

Bigg Boss 4 Telugu Contestants List Viral ; ఇప్పటివరకు మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్ బాస్ త్వరలో నాలుగో సీజన్ మొదలు కాబోతుంది.

Update: 2020-07-21 10:23 GMT
bigg boss telugu season 4

Bigg Boss 4 Telugu Contestants List Viral: ఇప్పటివరకు మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్ బాస్ (Telugu Bigg Boss 4)త్వరలో నాలుగో సీజన్ మొదలు కాబోతుంది. తాజాగా నాలుగో సీజన్ పైన స్టార్‌ మా అధికారిక ప్రకటనను విడుదల చేసింది.. అంతేకాకుండా బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా రిలీజ్ చేసింది స్టార్ మా..చూస్తుంటే మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న లిస్టు ఇలా ఉంది.

1. పూనమ్ భజ్వా

2. శ్రద్దాదాస్

3. హంసా నందిని

4. సింగర్ సునీత

5. మంగ్లీ (సింగర్)

6. హీరో నందు (గీతా మాధురి భర్త)

7. వైవా హర్ష

8. అఖిల్ సార్దక్

9. యామినీ భాస్కర్

10. మహాతల్లి (యూట్యూబ్ సంచలనం)

11. అపూర్వ

12. పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్)

13. మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్)

14. ప్రియ వడ్లమాని

15. సింగర్ నోయల్

ఇక ఇది ఇలా ఉంటే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూనే పకడ్భందీగా ఈ షోని నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ రెండు వారాలు ముందుగానే బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలట! అక్కడ వైద్యుల ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులని చెక్ చేస్తారట! ఇష్యూస్ ఏమీ లేకపోతే వారితోనే షోని కంటిన్యూ చేస్తారట నిర్వాహకులు.!

హోస్ట్ గా అక్కినేని వారి కోడలు!

తెలుగులో ప్రసారం అయిన మూడు సీజన్స్ కి హోస్ట్ గా మేల్ ఆర్టిస్ట్ లు మాత్రమే వ్యవహరించారు.... మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కి నాని, మూడో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు కొత్తగా షో నిర్వహకులు ఫిమేల్ సెలబ్రిటీతో ఈ ఏడాది సీజన్ ని నిర్వహించాలని అనుకుంటున్నారట.. అందులో భాగంగానే సమంత పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.. దీనికి సమంత ఒప్పుకుంటే మాత్రం ఇది గొప్ప విషయమే అని చెప్పవచ్చు.

Tags:    

Similar News