Bigg boss 4 telugu contestants: బిగ్ బాస్ 4లో నలుగురు హీరోయిన్స్?

Bigg boss 4 telugu contestants: బిగ్ బాస్ 4లో నలుగురు హీరోయిన్స్?
x
Highlights

Bigg boss 4 telugu contestants: నార్త్ లో పుల్ పాపులర్ అయిన బిగ్ బాస్ షో సౌత్ లో కూడా సత్తా చాటుతుంది.. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్ కి రెడీ అయిపోతుంది.. ఇందులో హీరో త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్, బిత్తిరి స‌త్తి త‌దిత‌రులు ఉంటారన్న ప్రచారం సాగుతోంది.. అయితే వీరితో పాటుగా మరో నలుగురు హీరోయిన్స్ కూడా ఈ సీజన్ లో పాల్గొంటున్నారన్న ప్రచారం బాగానే నడుస్తోంది!

bigboss 4 : నార్త్ లో పుల్ పాపులర్ అయిన బిగ్ బాస్ షో సౌత్ లో కూడా సత్తా చాటుతుంది.. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్ కి రెడీ అయిపోతుంది.. ఇందులో హీరో త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్, బిత్తిరి స‌త్తి త‌దిత‌రులు ఉంటారన్న ప్రచారం సాగుతోంది.. అయితే వీరితో పాటుగా మరో నలుగురు హీరోయిన్స్ కూడా ఈ సీజన్ లో పాల్గొంటున్నారన్న ప్రచారం బాగానే నడుస్తోంది!

వారెవరో కాదు.. శ్రద్ధా దాస్, యామిని భాస్కర్, నటి హంసా నందిని ప్రియా వడ్లమాని. వీరందరూ ఇప్పటికే సినిమాల్లో హీరోయిన్ గా నటించిన వారే.. సిద్దు ఫ్రం శ్రీకాకుళం, ఆర్య 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ ని ఈ సారి షో నిర్వాహకులు బిగ్ బాస్ లోకి తీసుకువస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది.

ఇక వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన హంసనందిని ఆ తరవాత అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా సినిమాలలో ప్రత్యేక గీతలలో నటించి ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటిని ఇప్పుడు బిగ్ బాస్ 4లో తీసుకువచ్చేందుకు షో నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని సమాచారం..

ఇక తెలుగు నటి యామిని భాస్కర్ ఎవరో కాదు.. నాగశౌర్య హీరోగా వచ్చిన నర్తనశాల సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఇక హుషారు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రియా వడ్లమాని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చేందుకు షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సారి షో పుల్ గ్లామర్ తో నిండిపోతుంది అన్నమాట!

హోస్ట్ గా అక్కినేని వారి కోడలు!

తెలుగులో ప్రసారం అయిన మూడు సీజన్స్ కి హోస్ట్ గా మేల్ ఆర్టిస్ట్ లు మాత్రమే వ్యవహరించారు.... మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కి నాని, మూడో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు కొత్తగా షో నిర్వహకులు ఫిమేల్ సెలబ్రిటీతో ఈ ఏడాది సీజన్ ని నిర్వహించాలని అనుకుంటున్నారట.. అందులో భాగంగానే సమంత పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.. దీనికి సమంత ఒప్పుకుంటే మాత్రం ఇది గొప్ప విషయమే అని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories