Big Boss 4 Telugu: వైరల్ అవుతున్న నలుగురు కంటెస్టెంట్ల పేర్లు!

Big Boss 4 Telugu: వైరల్ అవుతున్న నలుగురు కంటెస్టెంట్ల పేర్లు!
x
Bigg Boss (File Photo)
Highlights

నార్త్ లో మంచి పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సౌత్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది.

నార్త్ లో మంచి పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సౌత్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇక తెలుగులో విజయవంతంగా మూడు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ పై మొన్నటివరకూ అందరిలో సందిగ్దత నెలకొంది. లాక్ డౌన్ కారణంతో పలు షూటింగ్ లు వాయిదా పడటంతో బిగ్ బాస్ నాలుగో సీజన్ అసలు మొదలవుతుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇండోర్ షూటింగ్ లకి తక్కువమందితో అనుమతి ఇవ్వడంతో బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి.

బిగ్‌బాస్ కార్యక్రమం సాధార‌ణంగా జూలైలో ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే ఈసారి కాస్త లేట‌య్యేట్టున్నా లేటెస్ట్‌గా వ‌చ్చేందుకు త‌గు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేవారిని ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగానే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో సింగర్ మంగ్లీ, హీరో త‌రుణ్‌, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్‌, సీరియ‌ల్ న‌టుడు అఖిల్ సార్థక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ న‌లుగురి పేర్లు ఫైన‌ల్ లిస్టులో ఉంటాయా? లేకా మార్పులు ఏమైనాఉంటాయా? వీళ్లతోపాటు ఇంకా ఎవ‌రెవ‌రు బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్తారు? అన్నది తెలియాలంటే ఆఫీషియల్ అంనౌన్సమెంట్ వచ్చేవరకు ఎదురుచూడక తప్పదు.

ఇక ఈ నాలుగో సీజన్ కి ఎవరు హోస్ట్ చేయనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతే స్థాయిలో అక్కినేని నాగార్జున పేరుకు వినిపిస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్ ని హీరో నాని, మూడో సీజన్ ని నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక నాలుగో సీజన్ ని కూడా అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసి చేయనున్నారని సమాచారం. త్వరలో దీనిపైన ఓ ఆఫీషియల్ అన్నౌన్సుమేంట్ రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories