నా భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు : సమంత

నా భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు : సమంత
x
Highlights

అక్కినేని వారి కోడలు సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అక్కినేని వారి కోడలు సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెడుతూ అలరిస్తుంది. తాజాగా యంగ్ హీరో రానా రోకా ఫంక్షన్‌లో దగ్గుబాటి ఫ్యామిలీతో పాటుగా నాగచైతన్య, సమంత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ తీసిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ముందుగా రానా, మిహికాలకి 2020లో ఒక మంచి వార్త చెప్పినందుకు థాంక్స్ చెబుతూ ధన్యవాదాలు తెలిపింది. ఆ తర్వాత తన భర్తను ఆటపట్టించేలా ఫన్నీ పోస్ట్ చేసింది సమంత..'అమ్మ, అంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సమయం వచ్చింది. చూడండి నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా?(భర్త ఎక్కడో ఒక్క పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు అందులో దూకడానికి)' అంటూ పోస్ట్ చేసింది. అయితే దీనిపైన నాగచైతన్య సరదాగా స్పందించాడు. ఇదేదో ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందని చైతూ కామెంట్ చేశాడు.

జాను సినిమాతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం తమిళ్, తెలుగు భాషలలో నటిస్తుంది. ఇక అటు నాగచైతన్య మజిలి సినిమాతో మంచి హిట్ కొట్టి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా పరుశురాం దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నాడు చైతూ.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories