ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ?

ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ?
x
JR NTR (File Photo)
Highlights

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది నభా నటేష్.. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి...

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది నభా నటేష్.. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి ఇటు అందంతో, అటు అభినయంతోను ఆకట్టుకుంది ఈ భామ.. ఈ సినిమాకి గాను నటిగా మంచి గుర్తింపు రావడంతో ఆమెకి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కో రాజా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో నభా నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా ఇప్పుడు మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టనుంది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నూతన దర్శకడు సుబ్బు దర్శకత్వంలో తెరకేక్కబోయే సోలో బ్రతుకే సో బెటరూ అనే సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది నభా.. సినిమా షూటింగ్ కూడా మొదలైంది. చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇతెవలె రిలీజ్ అయిన పాట కుడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమా హిట్టు అయితే నభా నటేష్ కి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం..ఇదిలా ఉండగా నభా నటేష్ టాలీవుడ్ లో ఓ బంపర్ ఆఫర్ కొట్టేసిందని సమాచారం. అది కూడా ఏ మిడిల్ రేంజ్ హీరోతో అనుకుంటే పొరపాటే. నభా ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ దొరికిందని సినీ వర్గాల సమాచారం.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం).. సినిమాలో నటిస్తున్న తారక్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి.



ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ని ఫైనల్ చేశారని.. ఈ సినిమాలో నభా నటేష్ తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతోందని సమాచారం. ఇక నభా నటేష్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్' సినిమాలు దాదాపుగా పూర్తయ్యాయి. పరిస్థితులు చక్కబడి షూటింగ్స్ స్టార్ట్ అయితే మిగతా భాగం షూట్ చేయనున్నారు అని సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories