బిగ్ బాస్ 3 తెలుగు: ఈ భామల్లో ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా?

బిగ్ బాస్ 3 తెలుగు: ఈ భామల్లో ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా?
x
Highlights

బిగ్ బాస్ 3 ఆసక్తి కరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ గేమ్ షో కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఐదోవారం ఎలిమినేషన్ కూడా పూర్తయిపోయింది. మొత్తం పదిహేను మందితో...

బిగ్ బాస్ 3 ఆసక్తి కరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ గేమ్ షో కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఐదోవారం ఎలిమినేషన్ కూడా పూర్తయిపోయింది. మొత్తం పదిహేను మందితో ప్రారంభమైన ఈ సీజన్ లో ఇప్పుడు 11 మంది హౌస్ లో మిగిలారు. బాబాభాస్కర్, పునర్నవి, వితిక, వరుణ్, రాహుల్, మహేష్, హిమజ, శ్రీముఖి, రవికృష్ణ, అలీ రెజా, శివజ్యోతి హౌస్ లో కొనసాగుతున్నారు. మొదటి వారం హేమ ఎలిమినేట్ అయిన తరువాత తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఓ రెండు వారాలు కొనసాగి ఎలిమినేట్ అయిపోయారు.

ఇప్పుడు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనే ఇటువంటి ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు మాత్రం కచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పుకుంటున్నారు. శ్రద్ధా దాస్ లేదా ఈషా రెబ్బా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిజానికి మొదటి వారం ఎలిమినేషన్ సమయంలోనే ముందు శ్రద్ధా దాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు. కానీ, అనుకోకుండా తమన్నా సీన్ లోకి వచ్చారు. ఆమె బయటకు వెళ్లిపోవడంతో ఒకరిని బిగ్ బాస్ లోకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈషారెబ్బ, శ్రద్ధ దాస్ లతో బిగ్ బాస్ టీం చర్చించిందనే వార్త చక్కర్లు కొడుతోంది.

ఈవారంలోనే వీరిద్దరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ లోకి వేల్లబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తీరు చూస్తుంటే ఈవారంలోనే కొత్త కంటెస్టెంట్ అకస్మాత్తుగా హౌస్ లోకి వెళుతుందని భావిస్తున్నారు. బిగ్ బాస్ షో లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలోనూ ఇలా జరగదని చెప్పడానికి వీలులేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories