BiggBoss 4 Telugu: కోసం ఫైనల్ అయిన కంటెస్టెంట్స్?

BiggBoss 4 Telugu: కోసం ఫైనల్ అయిన కంటెస్టెంట్స్?
x
Highlights

BiggBoss 4 Contestents: తెలుగులో సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్స్ ను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ కి ముస్తాబవుతోంది..

BiggBoss 4 Contestents: తెలుగులో సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్స్ ను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ కి ముస్తాబవుతోంది.. అయితే ఈ షో లో కంటెస్టెంట్ లు ఫైనల్ అయ్యారని దీనికి సంబంధించిన ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఇందులో హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష, నటుడు తాగుబోతు రమేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడక తప్పదు..

అయితే ఇక్కడ జబర్దస్త్ సంబంధించిన హైపర్ ఆది, తాగుబోతు రమేష్ పేర్లు వినిపించడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే హైపర్ ఆది ఇప్పుడు జబర్దస్త్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ఇలాంటి సమయంలో హైపర్ ఆది జబర్దస్త్ ను వదిలేస్తాడా అన్న అనుమానం కలుగుతుంది. ఒక తాగుబోతు రమేష్ విషయానికి వస్తే.. తాజాగా లాక్ డౌన్ వల్ల మళ్లీ షూటింగ్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతానికైతే కొత్త సినిమాలు షూటింగ్ మొదలుకాలేదు.. ఆగిపోయిన షూటింగ్ లు మాత్రమే కొనసాగుతున్నాయి.. ఈ సమయంలో అవకాశాలు లేకా జబర్దస్త్ లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చాడు తాగుబోతు రమేష్.. ఇక అటు బిగ్ బాస్ షో కూడా ఆగస్టులోనే స్టార్ట్ అవుతుడడంతో ఇప్పుడు తాగుబోతు రమేష్ జబర్దస్త్ షో ని వదిలేస్తాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

హోస్ట్ గా అక్కినేని వారి కోడలు!

తెలుగులో ప్రసారం అయిన మూడు సీజన్స్ కి హోస్ట్ గా మేల్ ఆర్టిస్ట్ లు మాత్రమే వ్యవహరించారు.... మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కి నాని, మూడో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు కొత్తగా షో నిర్వహకులు ఫిమేల్ సెలబ్రిటీతో ఈ ఏడాది సీజన్ ని నిర్వహించాలని అనుకుంటున్నారట.. అందులో భాగంగానే సమంత పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.. దీనికి సమంత ఒప్పుకుంటే మాత్రం ఇది గొప్ప విషయమే అని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories