Decoyt Postponed: భారీ సినిమాల ఎఫెక్ట్.. రేస్‌కి బ్రేక్.. అడివి శేష్ డెకాయిట్ పోస్ట్‌పోన్

Decoyt Postponed: మార్చి 19న విడుదల కావాల్సిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మూవీ డెకాయిట్ పోస్ట్‌పోన్ అయ్యింది. కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 10, 2026.

Update: 2026-02-04 07:24 GMT

 Decoyt Postponed: భారీ సినిమాల ఎఫెక్ట్.. రేస్‌కి బ్రేక్.. అడివి శేష్ డెకాయిట్ పోస్ట్‌పోన్

Decoyt Postponed: అడివి శేష్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రాబరీ థ్రిల్లర్ మూవీ ‘డెకాయిట్’ విడుదల వాయిదా పడింది. మొదట మార్చి 19, 2026న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే అదే తేదీన భారీ చిత్రాల పోటీ ఉండటంతో సినిమాను పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రకటించారు.

మార్చి 19న రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ తో పాటు యష్ నటించిన ‘టాక్సిక్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ బిగ్ క్లాష్ నేపథ్యంలో డెకాయిట్ చిత్రాన్ని ఆ రేస్ నుంచి తప్పించినట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

డెకాయిట్ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాను ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

డెబ్యూట్ డైరెక్టర్ షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మాజీ ప్రేమికులుగా కనిపించనున్నారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరూ కలిసి దొంగతనాలకు పాల్పడాల్సి వస్తుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

డెకాయిట్ గురించి అడివి శేష్ ఇటీవల మాట్లాడుతూ.. ఇది ఆధునిక ‘షోలే’ తరహా కథ అని తెలిపారు. నవ్వు, కోపం, భావోద్వేగాలు అన్నీ కలగలిపిన సినిమా అని పేర్కొన్నారు.

Tags:    

Similar News