Nayantara Goa Trip : గోవా ట్రిప్‌లో ప్రియుడితో నయన్!
Nayantara Goa Trip : సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతారకి మంచి పేరుంది. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా
Nayantara in Goa trip with her boy friend Vignesh
Nayantara Goa Trip : సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతారకి మంచి పేరుంది. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా బ్రేకప్ లతో కూడా నిత్యం వార్తల్లో ఉంటుంది ఈ భామ.. కేరియర్ ప్రారంభంలో హీరో శింబుతో రిలేషన్ ని మైంటైన్ చేసిన నయన్ ఆ తరువాత అతడికి బ్రేకప్ చెప్పేసి దర్శకుడు ప్రభుదేవాతో సహజీవనం చేసింది .. ఇక పెళ్లి వరకు వెళ్ళింది అనుకున్న వీరి ప్రేమ బ్రేకప్ తో ఎండ్ అయిపొయింది. ప్రస్తుతం నయన్ తమిళ స్టార్ డైరెక్టర్ విష్నేష్ శివన్‌తో రిలేషన్‌లో ఉంది.
ఎక్కడికి వెళ్లిన శివన్-నయనతార కలిసే వెళుతారు. బర్త్ డే వేడుకలు, క్రిస్మస్, ఓనమ్ ఇలా ఏ పండుగ వచ్చినా సరే ఈ ఇద్దరూ సెలబ్రేట్ చేసుకని దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారా అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా నయనతార గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆమెతోపాటు ప్రియుడు విఘ్నేశ్ శివన్, ఆయన కుటుంబ సభ్యులు కూడా విహారయాత్రకు వెళ్లారు.
దీనికి సంబంధించిన ఫోటోలను విఘ్నేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నయనతార తెలుపు రంగు గౌనులో ప్రకృతి ఆస్వాదిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలుపు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది అంటూ నయన్ ఫొటోలకు విఘ్నేశ్ క్యాప్షన్ ఇవ్వడం మరో విశేషం.. ఇక నయనతార సినిమాల విషయానికి వచ్చేసరికి గత ఏడాది చిరంజీవి సైరా, విజయ్ విజిల్ సినిమాలతో సందడి చేసింది నయన్.. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రజనీకాంత్ దర్బార్ సినిమాతో సందడి చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.