నయనతారని యాంకర్ గా ఎప్పుడైనా చూశారా?

nayanatara
x
nayanatara
Highlights

ఈ వీడియోని చూసిన నెటిజన్లు అసలు మనం చూస్తున్నది నయనతారనేనా అని ఆశ్చర్యపోతున్నారు. అంతకుమించి నయన్ ఒరిజినల్ వాయిస్

ఇటు అందం అటు అభినయంతో ఆకట్టుకునే నటి నయనతార.. సీనియర్ హీరోస్ పక్కన హీరోయిన్ ఎవరు అంటే అందరికి గుర్తొచ్చే మొదటి పేరు నయనతారనే.. 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో పలు భాషల్లో సినిమాలు చేసి లేడి సూపర్ స్టార్ గా ఎదిగింది నయనతార.. ఇప్పుడు సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతార రికార్డు సృష్టించింది. తాజాగా సైరా, విజిల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది నయన్..

అయితే ఇప్పుడు నయనతారకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార హీరోయిన్ గా కాకముందు ఓ మలయాళం ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛానల్ షోలో యాంకర్‌గా తన పేరు డయాన మరియమ్ కురియన్, మళ్లీ షో టైం వరకు వెయిట్ చేయండి అంటూ నయనతార చెప్పే వీడియో హాల్ చల్ చేస్తుంది.

ఈ వీడియోని చూసిన నెటిజన్లు అసలు మనం చూస్తున్నది నయనతారనేనా అని ఆశ్చర్యపోతున్నారు. అంతకుమించి నయన్ ఒరిజినల్ వాయిస్ విని మరింత షాక్ అవుతున్నారు. నయనతార ఇప్పటివరకు తమిళ్, మలయాళం సినిమాలకి మాత్రమే డబ్బింగ్ చెప్పారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories