Game Changer: గేమ్‌ ఛేంజర్‌ ఫలితంపై స్పందించిన అంజలి.. ఏమన్నారంటే..?

Game Changer: రామ్‌చరణ్‌ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్‌ ఛేంజర్‌' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదని తెలిసిందే.

Update: 2025-01-28 06:31 GMT

Game Changer: గేమ్‌ ఛేంజర్‌ ఫలితంపై స్పందించిన అంజలి.. ఏమన్నారంటే..?

Game Changer: రామ్‌చరణ్‌ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్‌ ఛేంజర్‌' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదని తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓపెనింగ్స్‌లో సత్తా చాటినా ఆ తర్వాత ఊపును కొనసాగించలేకపోయింది. తొలిరోజే ఈ సినిమా ఏకంగా రూ. 180 కోట్లకుపైగా రాబట్టింది.

కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి కథానాయికలుగా నటించగా.. తమిళ నటుడు ఎస్.జే. సూర్య విలన్‌ రోల్‌లో అద్భుతంగా నటించి మెప్పించారు. శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం వంటి ప్రముఖులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. కాగా మంచి మెసేజ్‌ ఓరియెంట్‌డ్‌గా వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.

కాగా ఈ సినిమాలో అంజలి పాత్రకు మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా అంజలి గేమ్‌ ఛేంజర్‌ మూవీ ఫలితంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంజలి నటించిన "మదగజరాజ" సినిమా జనవరి 31న తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజలి స్పందించారు.

ఈ సందర్బంగా అంజలి మాట్లాడుతూ.. 'నటిగా నా బాధ్యత నా పాత్రను పూర్తి నిబద్ధతతో పోషించడమే. నా పాత్రకు సంబంధించిన బాధ్యతను 100 శాతం నెరవేర్చానా అనే దానిపై నేను దృష్టి సారిస్తాను. సినిమా విజయానికి సంబంధించిన విషయంలో, ప్రేక్షకులను సినిమా గురించి వివరించడానికి ప్రమోషన్స్‌లో పాల్గొంటాము. గేమ్ ఛేంజర్ చూసిన ప్రేక్షకుల్లో ఎవరూ కూడా ‘సినిమా బాగోలేదు’ అని చెప్పలేదు. అందరూ ‘మంచి సినిమా చూశాం’ అని అభిప్రాయపడ్డారు' అని చెప్పుకొచ్చారు.

మంచి సినిమా అనిపించుకోవడం ఒక విషయం, కానీ ఆ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకోవడం మరో విషయమన్న అంజలి, గేమ్ ఛేంజర్ ఒక మంచి సినిమా అని తాను నమ్ముతున్నానంది. దర్శకుడు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తన వంతు పాత్రను పూర్తి నిబద్ధతతో చేశానని.. అయితే, గేమ్ ఛేంజర్ గురించి మరింతగా మాట్లాడాలంటే, దీని కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News