Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్ లీక్‌.. ఇద్దరి అరెస్ట్..!

Game Changer: గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’.

Arun Chilukuri
Published on: 6 Nov 2023 3:57 PM IST
Cyber Police Arrest Two for Leaking Game Changer Song
X

Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్ లీక్‌.. ఇద్దరి అరెస్ట్..!

Game Changer: గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

గేమ్ చేంజర్ సినిమా నుంచి గతంలో ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు.

సైబర్ క్రైమ్ ఏసీపీ చాంద్ భాషా, ఎస్సై భాస్కర్ రెడ్డి, ప్రసేన్ రెడ్డి, సాయి తేజ్ గార్ల బృందం ఈ కేసును చేధించారు. సాంగ్‌ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.

దీపావ‌ళి సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story