Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-09 01:31 GMT
Live Updates - Page 2
2020-07-09 13:49 GMT

యు ఎస్ ఐ బి సి ఇన్వెస్ట్మెంట్ వెబీనార్ లో మంత్రి కేటిఆర్

- తెలంగాణలో పెట్టుబడుల వాతావరణాన్ని ప్రశంసించిన అమెరికన్ కంపెనీలు

- నూతన పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశమన్న అమెరికన్ కంపెనీల అధినేతలు

- తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్న మంత్రి కేటీఆర్

- టియస్ ఐపాస్ అద్భుతమైన విధానమన్న కంపెనీలు

2020-07-09 13:25 GMT

ప్రధాని నరేంద్రమోడీకి వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు లేఖ

- ప్రధాని నరేంద్రమోడీకి వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు మరో లేఖ రాసారు.

- వైసీపీ ఎంపీ రాసిన లేఖలో మోడీ పై ప్రశంసలు కురిపించారు.

- వ్యవసాయరంగానికి మౌళిక సదుపాయాల కోసం లక్ష కోట్లు కేటాయిస్తూ మోడీ తీసుకున్న నిర్ణయానికి రఘురామకృష్ణం రాజు కృతజ్ఞతలు తెలిపారు.

- పీఎం ఆవాజ్ యోజనా పథకం ద్వారా వలస కార్మికులకు కరోనా కష్టకాలంలోనూ అండగా నిలిచారని తెలిపారు.

- పీఎం గరీభ్ కళ్యాణ్ యోజనా పథకం నవంబర్ వరకూ పొడిగించారు.

- 81 కోట్ల మంది పేదల ఆకలి తీర్చిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



2020-07-09 13:09 GMT

పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది.

- అటు కాపర్ డ్యాం వద్ద నీటిమట్టం 20.95 మీటర్లకు చేరింది.

- పోలవరం వద్ద కూడా నీటిమట్టం 6.89 మీటర్లకు చేరింది.

2020-07-09 09:02 GMT

- తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్ కి కరోనా భయం

- స్థానిక జగ్గయ్య చెరువులో స్కీం పేరుతో ప్రజలను మోసం పచేసిన వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాజిటివ్

- విచారణ చేసే సమయంలో పోలీసులతో కలిసి ఉన్న వైనం

- అరెస్టుకు ముందు పరీక్షలు నిర్వహించగా నేడు కరోనా పాజిటివ్గా నిర్ధారణ

- అతడితో కాంటాక్ట్ అయిన వారందరికీ కరోనా భయం...

2020-07-09 08:21 GMT

@ విజయవాడలో ఈ మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా కోవిడ్ నమూనాలు తీసుకునే ప్రాంతాలు:

1. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం

2. గాంధీ మున్సిపల్ హైస్కూల్, వన్ టౌన్

3. కృష్ణలంక

4. విజయవాడ రైల్వే స్టేషన్

5. బసవపున్నయ్య స్టేడియం, అజిత్ సింగ్ నగర్

6. మేరీమాత టెంపుల్, గుణదల

ఉదయం 8 నుంచి 5గంటల వరకు

అపాయింట్మెంట్ కోసం కాల్ చేయాల్సిన నంబర్: 9963112781

ఆన్ లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: https://covid-andhrapradesh.verahealthcare.com/

2020-07-09 04:34 GMT

భారత్ లో ఒక్కరోజులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus: 24,879 కరోనా పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదు

- అతి పెద్ద ఒక్కరోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇది

- దీంతో  ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య  7.67 లక్షలు

- మరణాలు 21,129 


2020-07-09 04:25 GMT

ఎనిమిది మంది పోలీసులను చంపిన వి కాస్ దుబే అరెస్ట్

- యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అరెస్ట్

- మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో అరెస్టు చేసిన పోలీసులు

- నాలుగు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ లో 8  మంది పోలీసులను చంపి తప్పించుకున్న వికాస్ దుబే 

- వికాస్ దుబే అనుచరుడిని నిన్న రాత్రి కాల్చి చంపిన పోలీసులు 

2020-07-09 03:15 GMT

అక్కడ కూడా కరోనాకు ఉచితంగా చికిత్స..

- కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మద్యకాలంలో నిరోధించే పరిస్థితి కనిపించడం లేదు.

- పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వీలైనంత మేర వైద్య సదుపాయాలు కల్పించాలన్నదే ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచనగా కనిపిస్తోంది.

- అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం కరోనా సోకితే ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

- పూర్తి వివరాలు 

2020-07-09 03:00 GMT

ఏపీ సీఎంవోలో కీలక మార్పులు..

- ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సీఎంవోలో మార్పులకు శ్రీకారం చుట్టారు.

- ఇప్పటికే కొన్ని విభాగాలను చూస్తున్న వారికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

- ఈ మార్పులు తొందర్లోనే అమల్లోకి వస్తాయని సీఎంవో ప్రకటించింది.

- ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేషీలో పలు కీలక మార్పులు జరిగాయి. 

- పూర్తి వివరాలు 

2020-07-09 02:12 GMT

ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి: మండల యస్ఐ రవికృష్ణ

గుంటూరు : కారంపూడి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర కళాశిల్క్ బజార్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ వీధి ని పూర్తిగా కట్టడి చేసినట్లు మండల యస్ ఐ రవికృష్ణ తెలిపారు.

- ఈ సందర్భంగా కారంపూడి పట్టణంలో ఎక్కడైన ప్రజలు గుంపులుగా ఉండటం కానీ తిరగడం కానీ లేక షాప్ ల ముందు దుకాణాల ముందు ఎక్కువగా జనాలు ఉన్నట్లు గా ఉంటే మొదట ఆ షాప్ ని క్లోజ్ చేసి ఆ షాప్ ను పూర్తిగా నెల రోజుల పాటు క్లోజ్ చేయడమే కాక అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని యస్ఐ తెలిపారు.



Tags:    

Similar News