Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-09 01:31 GMT
Live Updates - Page 3
2020-07-09 02:06 GMT

నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే

- ఇప్పటివరకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న రైతు వ్యవసాయ పెట్టుబడితో పాటు రైతులు తీసుకున్న రుణంపై సున్నా వడ్డీ పథకంలో భాగంగా దానికి అందించే వడ్డీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం జగన్మోహరెడ్డి వెల్లడించారు.

- ఈ సొమ్ములు నాలుగు రోజులు ఆలస్యమైనా కంగారు పడవద్దని, నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పుకొచ్చారు.

- పూర్తి వివరాలు 

2020-07-09 01:54 GMT

విశాఖ మన్యంలో విషాదం..

 విశాఖ జిల్లా, జీ.మాడుగుల మండలంలో విషాహారం కలకలం, మగతపాలెంలో విషాహారం (ఆవు మాంసం) తిన్న గిరిజనులు, గ్రామంలో 76 మందికి అస్వస్థత, స్థానికి పీహెచ్సీలో చికిత్స, మరో ఐదుగురి పరిస్థితి విషమం. పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలింపు,

2020-07-09 01:48 GMT

కడప - బెంగళూరు మధ్య మూడు వరాల పాటు ప్రతి ఆదివారం బస్సులు బంద్

అమరావతి: ఆదివారం రోజున కడప-బెంగళూరు మధ్య నడిచే బస్సు సర్వీసులు ఇక నుంచి నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

- ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు స‌ర్వీసులు నిలిచిపోనున్నాయి.

- ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డ‌బ్బులు రిట‌న్ చేస్తామ‌ని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

- కోవిడ్-19 వ్యాప్తి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న నేప‌థ్యంలో ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్ ఉన్నందున రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్ల‌డించారు.

- మిగతా రోజుల్లో స‌ద‌రు రూటులో ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి.



Tags:    

Similar News