Massive Changes In AP Chief Minister Office: ఏపీ సీఎంవోలో కీలక మార్పులు..తొందర్లోనే అమల్లోకి !

Massive Changes In AP Chief Minister Office: ఏపీ సీఎంవోలో కీలక మార్పులు..తొందర్లోనే అమల్లోకి !
x
AP Government
Highlights

Massive Changes In AP Chief Minister Office: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సీఎంవోలో మార్పులకు శ్రీకారం చుట్టారు.

Massive Changes In AP Chief Minister Office: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సీఎంవోలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొన్ని విభాగాలను చూస్తున్న వారికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులు తొందర్లోనే అమల్లోకి వస్తాయని సీఎంవో ప్రకటించింది. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేషీలో పలు కీలక మార్పులు జరిగాయి. రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అదికారి, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, మరో రిటైర్డ్ అదికారి , సలహాదారు పివి రమేష్ ల కు గతంలో ముఖ్యమంత్రి ఆఫీస్ లో కేటాయించిన శాఖలను తొలగించి ,వాటిని ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయ అదికారులకు కేటాయించారు. వీరిద్దరూ సలహాదారుల పాత్రకే పరిమితం అవుతారు.

ఇప్పటి వరకూ అజేయ కల్లం చూస్తున్న శాఖలను సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు అప్పగించారు. జీఏడీ, కేంద్ర-రాష్ట్ర సత్సంబంధాలు, సీఎంవో ఎస్టాబ్లి్‌షమెంట్‌, రెసిడెన్షియల్‌ సబ్జెక్ట్‌, రాష్ట్ర విభజన చట్టం అంశాలు, ప్రధానమంత్రికి సీఎం రాసిన లేఖలు, అభ్యర్థనల పర్యవేక్షణ, ముఖ్యమైన వారితో నిర్వహిచే లావాదేవీలు, కేబినెట్‌ మినిస్టర్లు, తదితర శాఖలు పర్యవేక్షిస్తారు.హెల్త్‌, మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ శాఖ, ఎడ్యుకేషన్‌, హయ్యర్‌ అండ్‌ టెక్నికల్‌ శాఖలను ఇప్పటిదాకా రమేశ్‌ చూసేవారు. వాటిని సీఎంవో కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డికి అప్పగించారు

ఆరోఖ్యరాజ్‌కు రవాణా, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ, హౌసింగ్‌, ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల అంశాలు, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌, సెర్ప్‌, పాఠశాల విద్య, ఉన్నత సాంకేతిక విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం, ఎలకా్ట్రనిక్స్‌, కమ్యూనికేషన్స్‌, మైన్స్‌ జియాలజీ, కార్మిక ఉపాధి శాఖలు అప్పగించారు. ధనుంజయరెడ్డికి జల వనరులు, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఇంధనం, పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, మార్కెటింగ్‌, సహకార శాఖలను అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories