Health Tips: ఈ ప్రత్యేకమైన ఆహారం కొలస్ట్రాల్‌ తగ్గిస్తుంది.. గుండె జబ్బులు దూరం..!

Health Tips: నిత్య జీవితంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం.

Update: 2022-11-18 01:55 GMT

Health Tips: ఈ ప్రత్యేకమైన ఆహారం కొలస్ట్రాల్‌ తగ్గిస్తుంది.. గుండె జబ్బులు దూరం..!

Health Tips: నిత్య జీవితంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అయినప్పటికీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బాదం, సోయా, పప్పుధాన్యాలతో కొలస్ట్రాల్‌ తగ్గించవచ్చని తాజా పరిశోధనలో తేలింది. అంతేకాదు రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, వాపులు, గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గించవచ్చు. పరిశోధకులు దీనికి పోర్ట్‌ఫోలియో డైట్ అని పేరు పెట్టారు. ఇది 2,000 కేలరీల ఆహారంపై ఆధారపడి ఉంటుంది.

తక్కువ కొలెస్ట్రాల్ ఆహారంతో పాటు మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ 30 శాతం తగ్గుతుందని తేలింది. ఇది కాకుండా గుండెపోటుతో సహా మొత్తం గుండె జబ్బుల ప్రమాదాన్ని 13 శాతం తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. 'పోర్ట్‌ఫోలియో డైట్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని మాకు తెలుసు. కానీ అది ఏమి చేయగలదో స్పష్టమైన వైఖరి లేదని కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయంలో వైద్య బృందం తెలిపింది.

ఈ వ్యాధుల ప్రమాదం తక్కువ

రక్తపోటు ప్రమాదంలో 2 శాతం తగ్గింపు, వాపు ప్రమాదంలో 32 శాతం తగ్గింపు ఉందని జాన్ సివెన్‌పైపర్ కనుగొన్నారు. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడం వల్ల రోగి అధిక కొలెస్ట్రాల్, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత అధ్యయనం ఈ దిశలో మరింత హేతుబద్ధతను అందిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

Tags:    

Similar News