Natural Remedy : నేల ఉసిరి కనిపిస్తే వదలకండి..మొటిమల నుంచి మలబద్ధకం వరకు అన్నిటికీ ఇదే మందు
Natural Remedy :మన చుట్టూ ఉండే మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి, కానీ అవగాహన లేక మనం వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాం.
Natural Remedy : నేల ఉసిరి కనిపిస్తే వదలకండి..మొటిమల నుంచి మలబద్ధకం వరకు అన్నిటికీ ఇదే మందు
Natural Remedy: మన చుట్టూ ఉండే మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి, కానీ అవగాహన లేక మనం వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాం. అలాంటి వాటిలో నేల ఉసిరి అత్యంత శక్తివంతమైనది. కేవలం ఒక అడుగు ఎత్తు మాత్రమే పెరిగే ఈ మొక్క ఆకుల వెనుక చిన్న చిన్న కాయలు ఉంటాయి. ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్లను అడ్డుకోవడంలో సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా హెపటైటిస్ ఎ, బి, సి వంటి వైరస్‌ల వల్ల వచ్చే పచ్చకామెర్లకు ఇది అద్భుతమైన పరిష్కారం చూపుతుంది. రక్తంలోని బిలిరుబిన్ స్థాయిని తగ్గించి, కాలేయాన్ని బలోపేతం చేయడంలో దీనికి సాటి లేదు.
చర్మ సమస్యలతో బాధపడేవారికి నేల ఉసిరి ఒక వరప్రదాయిని. మొటిమలు, ఎగ్జిమా, దురద, చర్మంపై వచ్చే దద్దుర్లను తగ్గించడంలో ఇది బాహ్య పూతగా బాగా పనిచేస్తుంది. ఈ ఆకులను నూరి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇది కేవలం పైన పూయడానికే కాదు, లోపలికి తీసుకోవడం వల్ల శరీరం లోపల ఉన్న వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది.
నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. నేల ఉసిరి ఆకుల రసం లేదా పొడిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది పేగుల కదలికను సులభతరం చేసి, మలవిసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. కేవలం జీర్ణ వ్యవస్థనే కాకుండా, పరోక్షంగా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మెదడుకు సంబంధించిన నాడీ వ్యవస్థ సమస్యలను దరిచేరకుండా చూస్తుంది. హిల్స్, హెర్పెస్ వంటి వ్యాధుల నివారణలో కూడా దీని పాత్ర కీలకమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ మొక్కను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీలు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నేల ఉసిరిని ఔషధంగా వాడే ముందు ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి. సరైన మోతాదులో వాడితేనే దీని పూర్తి ఫలితాలు అందుతాయి. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ ఉచిత వైద్యుడిని గుర్తించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.