Morning Body Pain: ఏ పని చేయకపోయినా ఒళ్లు నొప్పులా? మీలో ఈ సమస్య ఉన్నట్లే
Morning Body Pain: చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే భుజాల్లో నొప్పి, వెన్నులో గట్టిదనం, కాళ్లలో భారంగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
Morning Body Pain: ఏ పని చేయకపోయినా ఒళ్లు నొప్పులా? మీలో ఈ సమస్య ఉన్నట్లే
Morning Body Pain: చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే భుజాల్లో నొప్పి, వెన్నులో గట్టిదనం, కాళ్లలో భారంగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఎలాంటి పని చేయని వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా.?
శరీరంలో ఇన్‌ఫ్లమేషన్
ప్రస్తుత కాలంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చునే వారి సంఖ్య పెరుగుతోంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అలవాట్లు శరీరంపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి జీవనశైలి కారణంగా శరీరంలో చిన్న స్థాయి ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఈ ఇన్‌ఫ్లమేషన్ కండరాలు, కీళ్లలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఫలితంగా ఉదయం లేవగానే శరీరం నొప్పిగా అనిపించవచ్చు.
దీర్ఘకాలిక ఒత్తిడి కూడా ఒక కారణం
మన జీవితంలో ఒత్తిడి కూడా శరీర నొప్పులకు ప్రధాన కారణం కావచ్చు. ఎక్కువ కాలం టెన్షన్‌లో ఉండటం వల్ల శరీరంలో కొన్ని హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే శరీరంలోని నరాలు, కండరాలు ఎప్పుడూ టెన్షన్‌లో ఉన్నట్లుగా ఉంటాయి. దాంతో మెడ, భుజాలు, వెన్ను ప్రాంతాల్లో గట్టిదనం లేదా నొప్పి కలగవచ్చు.
నిద్ర సరిగా లేకపోతే సమస్యలు
శరీరానికి సరిపడా నిద్ర చాలా అవసరం. గాఢ నిద్ర సమయంలోనే శరీరం తనను తాను పునరుద్ధరించుకుంటుంది. కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి, శక్తి మళ్లీ సమతుల్యం అవుతుంది. కానీ నిద్ర పూర్తిగా లేకపోతే లేదా తరచూ మధ్యలో మెలకువ వస్తే శరీరానికి సరైన విశ్రాంతి దొరకదు. అందుకే ఉదయం లేవగానే అలసట, నొప్పి అనిపించవచ్చు.
ఆహారపు అలవాట్లు కూడా ప్రభావం చూపుతాయి
మనం తీసుకునే ఆహారం కూడా శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, రిఫైన్ షుగర్, ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకుంటే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో పండ్లు, కూరగాయలు, విత్తనాలు, డ్రైఫ్రూట్స్ వంటి పోషకాహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఒమేగా-3 ఉండే ఆహారం కండరాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి?
ఉదయం శరీర నొప్పులను తగ్గించుకోవడానికి కొన్ని అలవాట్లు పాటించడం అవసరం. ప్రతిరోజూ కొద్దిసేపు వ్యాయామం చేయాలి. ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం తగ్గించాలి. రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలి.
గమనిక: శరీర నొప్పులు ఎక్కువ రోజులు కొనసాగితే సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఇది మరేదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం అయ్యే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.