Medical Miracle: బొడ్డు తాడుతో ప్రాణాంతక వ్యాధులకు చెక్.. ఆధునిక వైద్యంలో మెడికల్ మిస్టరీ ఇదే!

Medical Miracle: బొడ్డు తాడు ఇక మెడికల్ వేస్ట్ కాదు.. అదొక అద్భుతమైన బయోలాజికల్ సిస్టమ్. కంటి చూపును కాపాడటంలో, మొండి గాయాలను నయం చేయడంలో గర్భనాళం (బొడ్డు తాడు) ఎలా సంజీవనిలా మారుతుందో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.

Update: 2026-03-11 11:33 GMT

Medical Miracle: బొడ్డు తాడుతో ప్రాణాంతక వ్యాధులకు చెక్.. ఆధునిక వైద్యంలో మెడికల్ మిస్టరీ ఇదే!

Medical Miracle: చాలా కాలం వరకు గర్భనాళం (బొడ్డు తాడు)ను కేవలం తల్లి గర్భంలో శిశువుకు పోషణ అందించే ఒక అవయవంగానే చూసేవారు. శిశువు జన్మించిన తర్వాత దీనిని 'మెడికల్ వేస్ట్‌'గా భావించి పారవేసేవారు. కానీ నేడు శాస్త్రవేత్తలు, వైద్యులు దీనిని ఒక అద్భుతమైన 'బయోలాజికల్ సిస్టమ్'గా గుర్తిస్తున్నారు. ఇందులో ఉండే ప్రత్యేక మూలకాలు కొత్త రకమైన చికిత్సలకు మార్గం చూపుతున్నాయని పరిశోధనల్లో తేలింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్లేసెంటా(బొడ్డు తాడు) లో స్టెమ్ సెల్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్రత్యేకమైన కణజాలాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న భాగాలను బాగు చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక గాయాలు, కంటికి సంబంధించిన క్లిష్టమైన సర్జరీల్లో ఇది కీలకంగా మారుతోందని చెబుతున్నారు.

అమ్నియోటిక్ మెంబ్రేన్ ప్రత్యేకత ఇదే..

ప్లేసెంటా(బొడ్డు తాడు)లో అత్యంత కీలకమైన భాగం 'అమ్నియోటిక్ మెంబ్రేన్'. ఇది గర్భంలో శిశువును రక్షించే సంచి యొక్క లోపలి పొర. ఈ పొరలో గాయాలను త్వరగా నయం చేసే సామర్థ్యం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా శరీరం బయటి కణజాలాలను అంగీకరించదు, కానీ ఈ పొరను మన రోగనిరోధక వ్యవస్థ సులభంగా స్వీకరిస్తుంది. అందుకే ఇది రోగులకు చాలా సురక్షితం అని పేర్కొంటున్నారు. అలాగే కంటి వైద్యంలో కూడా అమ్నియోటిక్ మెంబ్రేన్ వినియోగం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని చెబుతున్నారు. కంటిపై కెమికల్స్ పడినప్పుడు లేదా కార్నియా (నల్లగుడ్డు)పై గాయాలైనప్పుడు దీనిని ఒక 'బయోలాజికల్ బ్యాండేజ్'లా ఉపయోగిస్తారని వెల్లడించారు. ఇది వాపును తగ్గించడమే కాకుండా, కొత్త కణాలు పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కంటిపై మచ్చలు పడకుండా కాపాడి, రోగికి చూపు పోకుండా చేయడంలో ఇది సహాయపడుతుందని వివరించారు.

మధుమేహం వంటి వ్యాధుల వల్ల వచ్చే దీర్ఘకాలిక పుండ్లు, తీవ్రమైన కాలిన గాయాల చికిత్సలో ప్లేసెంటా నుంచి తీసిన స్టెమ్ సెల్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ కొత్త కణజాలాల ఉత్పత్తికి తోడ్పడతాయని చెప్పారు. తద్వారా మొండి గాయాలు కూడా త్వరగా నయమవుతాయని అన్నారు. ఒకప్పుడు వ్యర్థంగా భావించిన గర్భనాళం(బొడ్డు తాడు), నేడు ఆధునిక వైద్యంలో ఒక సంజీవనిలా మారుతోంది. భవిష్యత్తులో దీనిపై జరిగే మరిన్ని పరిశోధనలు.. మరిన్ని ప్రాణాంతక వ్యాధులకు చికిత్సను అందుబాటులోకి తెస్తాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News