BP: మంచి నీటితో బీపీకి చెక్ పెట్టొచ్చని తెలుసా.? ఎలాగంటే..
BP: అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే వీటి ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా సులభమైన మార్గం ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రతీరోజూ సరిపడ మంచి నీరు తీసుకున్నా బీపీకి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
BP: మంచి నీటితో బీపీకి చెక్ పెట్టొచ్చని తెలుసా.? ఎలాగంటే..
BP: అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే వీటి ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా సులభమైన మార్గం ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రతీరోజూ సరిపడ మంచి నీరు తీసుకున్నా బీపీకి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
నీరు తక్కువగా తాగితే ఏమవుతుంది?
మన శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రక్తంలో సోడియం స్థాయులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా రక్తపోటు పెరగడానికి కారణం కావచ్చు. సరిపడా నీరు తాగితే రక్తంలో సోడియం సాంద్రత సహజంగా తగ్గుతుంది.
ఇది చిన్న విషయం అనిపించినా దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పరిశోధనలో భాగంగా..
ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధకులు నాలుగు లక్షలకు పైగా మంది ఆరోగ్య వివరాలను పరిశీలించారు. రక్తంలో సోడియం స్థాయులు, రక్తపోటు సమస్యలు, గుండె ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు.
అధ్యయనం ప్రకారం రక్తంలో సోడియం మోతాదు ఎక్కువగా ఉన్నవారిలో అధిక రక్తపోటు మరియు గుండె వైఫల్యం ప్రమాదం ఎక్కువగా కనిపించింది.
రక్తంలో సోడియం సాధారణ స్థాయి ఎంత?
సాధారణంగా రక్తంలో సోడియం మోతాదు 135 నుంచి 146 ఎంఎంఓఎల్/ఎల్ మధ్య ఉండటం సాధారణంగా భావిస్తారు. కానీ ఈ స్థాయి గరిష్ఠానికి దగ్గరగా వచ్చినప్పుడే ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగడం ప్రారంభమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా 140 నుంచి 146 ఎంఎంఓఎల్/ఎల్ మధ్య సోడియం ఉన్నవారిలో రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించారు.
సోడియం స్థాయి పెరిగితే ఎంత ముప్పు?
అధ్యయనం ప్రకారం రక్తంలో సోడియం స్థాయి 143 ఎంఎంఓఎల్/ఎల్ దాటితే ఆరోగ్య ప్రమాదాలు మరింత పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో అధిక రక్తపోటు వచ్చే అవకాశం సుమారు 29 శాతం వరకు పెరుగుతుందని, గుండె వైఫల్యం ప్రమాదం దాదాపు 20 శాతం వరకు పెరుగుతుందని పరిశోధన వెల్లడించింది. వయస్సు, లింగం, బరువు, పొగతాగే అలవాటు వంటి అంశాలను పక్కన పెట్టినా ఈ సంబంధం కనిపించడం విశేషంగా భావిస్తున్నారు.
రోజుకు ఎంత నీరు తాగాలి?
శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. సాధారణంగా ఆరోగ్య నిపుణులు మగవారు రోజుకు సుమారు 3.7 లీటర్ల వరకు, మహిళలు సుమారు 2.7 లీటర్ల వరకు నీరు తాగాలని సూచిస్తున్నారు. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, వాతావరణం, శారీరక శ్రమ వంటి అంశాల ఆధారంగా నీటి అవసరం మారవచ్చు. కాబట్టి శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.