Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఇవి వండితే ప్రమాదమే.. వంటింటి హెచ్చరికలు ఇవే!

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో కొన్ని ఆహారాలు వండటం వల్ల పోషకాలు నశించడమే కాకుండా ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Update: 2026-01-28 11:28 GMT

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఇవి వండితే ప్రమాదమే.. వంటింటి హెచ్చరికలు ఇవే!

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ వంట పనుల్లో వేగం, గ్యాస్ ఆదా చేసే సాధనంగా ప్రతి ఇంట్లో ఉపయోగిస్తున్నారు. అయితే వంట త్వరగా పూర్తవుతుందని అన్ని రకాల ఆహారాలను కుక్కర్‌లో వండటం ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల వాటి పోషకాలు నాశనమవడమే కాకుండా, విషపదార్థాలు విడుదలయ్యే అవకాశమూ ఉందని చెబుతున్నారు.

నిపుణుల ప్రకారం, కుక్కర్‌లో అన్నం వండితే ఆర్సెనిక్ అనే విషపదార్థం విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని సూచిస్తున్నారు. అలాగే ఆకుకూరలను అధిక ఉష్ణోగ్రతల్లో కుక్కర్‌లో ఉడికిస్తే వాటిలోని కీలక పోషకాలు నశించి, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.

బీన్స్, చిక్కుళ్లు వంటి కొన్ని కూరగాయల్లో సహజంగా ఉండే టాక్సిన్లు ప్రెషర్ కుకింగ్ ద్వారా పూర్తిగా నశించవు. ఇవి జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులను ప్రెషర్ కుక్కర్‌లో మరిగిస్తే వాటి సహజ నిర్మాణం మారి పోషక విలువలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

టమోటాలు, చింతపండు వంటి పుల్లని పదార్థాలను కుక్కర్‌లో ఉడికించడం వల్ల అవి అధిక ఆమ్లత్వాన్ని సంతరించుకుంటాయని, ఇది ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. అలాగే బంగాళాదుంపలను కుక్కర్‌లో ఉడికిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అందువల్ల ఈ తరహా ఆహారాలను ఓపెన్ పాత్రల్లో, తక్కువ వేడి మీద వండటం ఆరోగ్యానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News