Climbing Stairs : మెట్లు ఎక్కే అవకాశం దొరికితే అస్సలు వదులుకోకండి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Climbing Stairs : మెట్లు ఎక్కే అవకాశం దొరికితే అస్సలు వదులుకోకండి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Update: 2025-08-19 10:00 GMT

Climbing Stairs : మెట్లు ఎక్కే అవకాశం దొరికితే అస్సలు వదులుకోకండి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Climbing Stairs : ప్రస్తుత కాలంలో ఎక్కడికెళ్లినా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు వచ్చేశాయి. దీంతో చాలామంది మెట్లు ఎక్కడం మానేశారు. ఎప్పుడూ హడావుడిగా ఉండే మనలాంటి వాళ్ళకు, ఒక ఫ్లోర్ నుండి మరొక ఫ్లోర్‌కు నిమిషాల్లో తీసుకెళ్లే లిఫ్ట్ ఉంటే చాలు అనుకుంటారు. కానీ, ఈ షార్ట్‌కట్ అన్ని వేళలా మంచిది కాదని ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యాయామం చేయడానికి సమయం లేనివారికి లేదా జిమ్‌కు వెళ్ళలేనివారికి మెట్లు ఎక్కడం చాలా ఉపయోగకరం. ఇది కష్టంగా అనిపించినప్పటికీ దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, మెట్లు ఎక్కడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఈ అలవాటు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి మెట్లు ఎక్కడం చాలా బెస్ట్

మెట్లు ఎక్కడం కూడా ఒక రకమైన వ్యాయామమే. ఇది మీ రోజువారీ పనుల్లో ఒక భాగం. దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆరోగ్య నిపుణులు కూడా మెట్లు ఎక్కే అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అధిక బరువు సమస్య ఉన్నవారికి, బరువు తగ్గడానికి ఈ అలవాటు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఇటీవల జరిపిన అధ్యయనాలు కూడా మెట్లు ఎక్కడం వల్ల కేలరీలు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుందని వెల్లడించాయి.

కండరాలు బలపడతాయి

మెట్లు ఎక్కడం వల్ల కాళ్ళ కండరాలు బలపడతాయి. రోజూ మెట్లు ఎక్కడం అలవాటు చేసుకుంటే కండరాలు బలహీనపడకుండా ఉంటాయి. అలాగే, మెట్లు ఎక్కడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కూడా బలపరుస్తుంది. దీంతో పాటు, కీళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఓపిక పెరుగుతుంది

మెట్లు ఎక్కడం శరీరంలోని కొవ్వును కరిగించే ఒక అద్భుతమైన వ్యాయామం. రోజూ క్రమం తప్పకుండా చేస్తే బరువు త్వరగా తగ్గుతారు. అంతేకాకుండా, మెట్లు ఎక్కడం అనేది ఓపికను పెంచే ఒక ఏరోబిక్ వ్యాయామం. రోజూ ఈ అలవాటు చేసుకుంటే ఓపిక పెరుగుతుంది. నడక వంటి ఇతర వ్యాయామాలతో పోలిస్తే మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ కేలరీలు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. మెట్లు ఎక్కడం వల్ల నిమిషానికి 8 నుండి 11 కేలరీలు ఖర్చవుతాయని గమనించారు. వారంలో ఐదు రోజులు, సుమారు 30 నిమిషాల పాటు మెట్లు ఎక్కితే బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News