Coconut Water Side Effects: కొబ్బరి నీళ్లతో జాగ్రత్త.. ఈ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్!
Coconut Water Side Effects: ప్రతి మనిషికి ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. ఎన్ని వేల కోట్లు సంపాదించిన ఒక్కసారి అనారోగ్యానికి గురైన మనిషి ఆరోగ్యాన్ని తిరిగి పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి తీసుకురావడం ముమ్మాటికి సాధ్యం కాదు.
Coconut Water Side Effects: ప్రతి మనిషికి ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. ఎన్ని వేల కోట్లు సంపాదించిన ఒక్కసారి అనారోగ్యానికి గురైన మనిషి ఆరోగ్యాన్ని తిరిగి పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి తీసుకురావడం ముమ్మాటికి సాధ్యం కాదు. ఇంతకీ ఆరోగ్యం గురించి ఈ క్లాస్ ఎందుకు అనుకుంటున్నారా.. ఏమీ లేదు.. మనలో చాలా మందికి కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి మంచింది అని అనుకుంటారు. కానీ ఇటీవల జరిగిన పలు పరిశోధనల్లో మనం ఆశ్చర్యపోయే ఒక విషయం వెలుగు చూసింది. ఇంతకీ ఆ షాకింగ్ విషయం ఏమిటో తెలుసా.. కొబ్బరి నీరు తాగడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటా. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిజానికి ఇప్పటి వరకు మనందరి అభిప్రాయంలో కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే దివ్యౌషధం. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ తాజాగా విడుదలైన పలు నివేదికల్లో కొబ్బరి నీరు తాగడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వెల్లడైంది. అసలు ఆ అధ్యయనంలో ఏం వెల్లడైంది అంటే.. సరైన హైజీన్ పాటించకుండా కట్ చేసిన కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా చాలా ప్రమాదం అని ఈ అధ్యయనం చెబుతుంది. ఎందుకంటే సరైన హైజీన్ పాటించకుండా కట్ చేసిన కొబ్బరి నీరు తాగడం వల్ల బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయని ఇది పేర్కొంది. కొబ్బరి నీళ్లు తాగే టైంలో, వాటిని కట్ చేసే సాధనాలు, ఆ నీరును తాగడానికి ఉపయోగించేవి శుభ్రంగా లేకపోతే, బ్యాక్టీరియా లేదా ఫంగస్ వంటి సూక్ష్మజీవులు మీరు తాగే ఆ కొబ్బరి నీటిలో కలిగి మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
శుభ్రంగా లేని పరిసరాల్లో ఏర్పాటు చేసిన కొబ్బరి బోండాల స్టాండ్‌లో, అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న కొబ్బరి బోండాల స్టాండ్‌లో కొబ్బరి నీళ్లు తాగడం చాలాచాలా ప్రమాదకరం అంటున్నారు వైద్యనిపుణులు. అలాగే ఎక్కువ టైం నిల్వ చేసిన కొబ్బరి నీటిని తాగడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరిగే ఛాన్స్ ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ ఇన్ఫెక్షన్ల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. నిజానికి కొబ్బరి నీళ్లు తాగడం మంచిదే, కానీ హైజీన్ పాటించని చోట్ల తాగడం చాలా ప్రమాదకరం అని పేర్కొన్నారు. కొబ్బరి నీరు తాజాగా ఉన్నప్పుడే తాగాలని, ఎక్కువ సమయం నిల్వ చేసిన వాటిని తాగకపోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే కొబ్బరి బోండాన్ని కట్ చేసే షాక్ వంటివి శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలని, కొబ్బరి నీటిని స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా గాజు పాత్రల్లో సర్వ్ తీసుకోవాలని సూచించారు. కచ్చితంగా ప్లాస్టిక్ సీసాల్లో ఎక్కువ టైం నిల్వ చేసిన కొబ్బరి నీరును తాగడం మానుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని తెలిపారు. అలాగే, కొబ్బరి నీటిని తాగిన తర్వాత కడుపు నొప్పి, వాంతులు, లేదా జీర్ణ సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కొబ్బరి నీరు తాగే విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.