Lifestyle: తలదిండుకి కూడా ఎక్స్పైరీ తేదీ ఉంటుందా.? ఎన్ని రోజులు వాడొచ్చు
Lifestyle: మనలో చాలా మందికి తలతిండు చేసుకునే అలవాటు ఉంటుంది. అయితే ప్రతీ వస్తువుకు ఒక ఎక్స్పైరీ తేదీ ఉన్నట్లే తల దిండుకు కూడా ఉంటుందని మీకు తెలుసా.? ఇంతకీ ఎన్ని రోజులకు ఒకసారి తలదిండును మార్చాలి.
Lifestyle: తలదిండుకి కూడా ఎక్స్పైరీ తేదీ ఉంటుందా.? ఎన్ని రోజులు వాడొచ్చు
Lifestyle: మనలో చాలా మందికి తలతిండు చేసుకునే అలవాటు ఉంటుంది. అయితే ప్రతీ వస్తువుకు ఒక ఎక్స్పైరీ తేదీ ఉన్నట్లే తల దిండుకు కూడా ఉంటుందని మీకు తెలుసా.? ఇంతకీ ఎన్ని రోజులకు ఒకసారి తలదిండును మార్చాలి.? ఒకవేళ మార్చకపోతే వచ్చే నష్టాలు ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మంచినిద్రకు తలదిండు ముఖ్యం
శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం మంచి నిద్ర చాలా అవసరం. సరైన సమయానికి పడుకోవడం మాత్రమే కాదు, పడుకునే పడక, బెడ్‌రూమ్ వాతావరణం కూడా సౌకర్యంగా ఉండాలి. ఇందులో దిండు కీలక పాత్ర పోషిస్తుంది. దిండు తల, మెడకు సరైన సపోర్ట్ ఇవ్వాలి. దిండు సరైన విధంగా లేకపోతే నిద్ర నాణ్యత తగ్గుతుంది. అందుకే దిండు పరిస్థితిని తరచుగా పరిశీలించడం అవసరం. అవసరమైతే సమయానికి మార్చడం మంచిది.
దిండు ఎంతకాలానికి మార్చాలి?
నిద్రకు సంబంధించిన సమాచారం అందించే అమెరికా సంస్థ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, నిపుణులు సాధారణంగా ప్రతి 1 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి దిండు మార్చడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేస్తే దిండు శుభ్రంగా ఉండటమే కాకుండా తలకు, మెడకు సరైన సపోర్ట్ ఇస్తుంది. అయితే దిండు ఎంతకాలం ఉపయోగించవచ్చో దాని మెటీరియల్, నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది.
దిండు మార్చాల్సిన సంకేతాలు
కొన్ని లక్షణాలు కనిపిస్తే మీ దిండు మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఉదయం లేవగానే మెడ నొప్పి లేదా గట్టిగా అనిపించడం. పడుకునేటప్పుడు సరైన సౌకర్యం లేకపోవడం. దిండు ఫ్లాట్‌గా మారడం లేదా గడ్డలు ఏర్పడటం. దిండుపై పసుపు రంగు మరకలు ఎక్కువగా కనిపించడం. రాత్రి సమయంలో అలర్జీ సమస్యలు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే కొత్త దిండు కొనడం మంచిది.
దిండు మెటీరియల్ ఆధారంగా జీవితకాలం
వివిధ రకాల మెటీరియల్‌తో తయారయ్యే దిండ్లకు వాడే కాలం కూడా వేరుగా ఉంటుంది. పాలియెస్టర్ దిండ్లు – సాధారణంగా సుమారు 1 సంవత్సరం. ఫోమ్ దిండ్లు – నాణ్యతపై ఆధారపడి 1–2 సంవత్సరాలు. లాటెక్స్ దిండ్లు – సుమారు 3 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు. మంచి నాణ్యత కలిగిన దిండు సాధారణంగా ఎక్కువకాలం పనిచేస్తుంది.
దిండు శుభ్రత ఎందుకు అవసరం?
దిండ్లు, వాటి కవర్లు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. బెడ్ షీట్ మార్చినప్పుడు దిండు కవర్ కూడా మార్చడం మంచిది. చాలా దిండ్లను వాషింగ్ మెషీన్‌లో కూడా కడగవచ్చు. పాత దిండ్లలో ధూళి, చెమట, ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. ఇవి అలర్జీ సమస్యలకు కారణం అవుతాయి. ముక్కు కారడం, కళ్లలో మంట, చర్మంలో దురద వంటి సమస్యలు రావచ్చు. ఇంకా ముఖం, జుట్టు నుంచి వచ్చే ఆయిల్, చెమట లేదా లాలాజలం దిండులో చేరి మరకలు ఏర్పడతాయి. ముఖ్యంగా దిండు తల, మెడకు సరైన సపోర్ట్ ఇవ్వాలి. లేదంటే మెడ, భుజాలు, కండరాల్లో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన నిద్ర కోసం దిండు శుభ్రంగా ఉంచడం, అవసరమైతే 1–2 సంవత్సరాలకు ఒకసారి మార్చడం మంచిది.