Bathroom Cleaning Tips: బాత్రూమ్ టైల్స్ హోటల్ రేంజ్‌లో మెరవాలా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి చాలు!
బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉన్నా, టైల్స్ మీద సబ్బు మురికి, నీటి మరకలు లేదా పసుపు రంగు పాచి కనిపిస్తే అది అపరిశుభ్రంగానే కనిపిస్తుంది.
Bathroom Cleaning Tips: బాత్రూమ్ టైల్స్ హోటల్ రేంజ్‌లో మెరవాలా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి చాలు!
బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉన్నా, టైల్స్ మీద సబ్బు మురికి, నీటి మరకలు లేదా పసుపు రంగు పాచి కనిపిస్తే అది అపరిశుభ్రంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా హాట్ వాటర్ వల్ల వచ్చే మరకలు సాధారణంగా తోమితే వదలవు. ఇలాంటి మొండి మరకలను చిటికెలో వదిలించి, మీ బాత్రూమ్‌ను హోటల్ రేంజ్‌లో మెరిపించే కొన్ని ఇంటి చిట్కాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బేకింగ్ సోడా మ్యాజిక్..
బేకింగ్ సోడా ఒక అద్భుతమైన క్లీనింగ్ ఏజెంట్. ఇది మొండి మురికిని వదిలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీ బాత్‌రూమ్‌ను మెరిపించడంలో ఎలా పని చేస్తుందంటే.. ఒక గిన్నె నీటిలో బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని స్పాంజితో టైల్స్‌పై అప్లై చేసి కాసేపు స్క్రబ్ చేయండి. ఆపై గోరువెచ్చని నీటితో కడిగితే టైల్స్ తళతళలాడుతాయి.
ఉప్పుతో క్లీనింగ్..
సాధారణ ఉప్పు మురికిని పారదోలడంలో బాగా పనిచేస్తుంది. మీ బాత్‌రూమ్‌ను మెరిపించడంలో ఈ ఉప్పు ఎలా పని చేస్తుందంటే.. ఒక తడి గుడ్డపై ఉప్పు చల్లి టైల్స్ మీద రుద్దండి. వీలైతే రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో స్క్రబ్ చేస్తూ కడిగేయండి. దీంతో బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.
నిమ్మకాయ - ఉప్పు కాంబినేషన్..
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ పసుపు మరకలను తొలగించడంలో పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ నిమ్మరసంలో రెండు టీస్పూన్ల ఉప్పు కలపండి. ఈ మిశ్రమాన్ని టైల్స్‌కు పట్టించి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. ఇది టైల్స్‌కు సహజమైన మెరుపును ఇస్తుంది.
వెనిగర్ స్ప్రేతో మెరుపు..
వెనిగర్ బాత్రూమ్ దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, టైల్స్‌ను క్లీన్‌గా ఉంచుతుంది. సమాన పరిమాణంలో వెనిగర్, నీటిని కలిపి స్ప్రే బాటిల్‌లో పోసుకోండి. టైల్స్‌పై స్ప్రే చేసి 10 నిమిషాల తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దండి. చూస్తే ఆశ్చర్యపోతారు.. మీ బాత్‌రూమ్‌లో పసుపు మరకలు మటుమాయం అవుతాయి.
బోరాక్స్ పౌడర్ పవర్..
బోరాక్స్ పౌడర్ టైల్స్ మీద ఉండే బూజును, మొండి మరకలను వదిలించడంలో ది బెస్ట్‌గా నిపుణులు చెబుతున్నారు. ఇది ఎలా పని చేస్తుందంటే.. 3 టీస్పూన్ల బోరాక్స్ పౌడర్, 1 టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేయండి. దీనిని టైల్స్ సందుల్లో (Grouting), మరకలపై రాసి కాసేపటి తర్వాత కడిగేయండి. అప్పుడు మీ బాత్‌రూమ్‌ను పట్టిపీడిస్తున్న మొండిమరకలు మటుమాయం కావాల్సిందే.
వీటిని కూడా ట్రై చేయండి..
వారానికి కనీసం రెండు సార్లు టైల్స్‌ను తుడవాలి.
శుభ్రం చేసేటప్పుడు చల్లని నీటి కంటే గోరువెచ్చని నీరు వాడితే మురికి త్వరగా వదులుతుంది.
బాత్రూమ్ వాడిన తర్వాత వీలైనంత వరకు టైల్స్‌ను పొడిగా ఉంచే ప్రయత్నం చేయండి.