Health Tips: గుడ్లు తినేవారికి అలర్ట్.. ఈ స్టోరీ మీకోమే!
Health Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వారివారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆధునిక జీవన విధానం కారణంగా అనేక మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Health Tips: గుడ్లు తినేవారికి అలర్ట్.. ఈ స్టోరీ మీకోమే!
Health Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వారివారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆధునిక జీవన విధానం కారణంగా అనేక మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకని చాలా మంది ఆరోగ్యకరమైన జీవనశైలిని వారి జీవన విధానంలో అలవర్చుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగా చాలా మంది ఉదయాన్నే గుడ్లు తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా. రోజుకు ఎన్ని గుడ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు, ఎక్కువగా గుడ్లు తింటే ఏం జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పలువురు ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ.. గుడ్డు అనేది ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుందని వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో గుడ్డును భాగం చేసుకోవడం చాలా మంచి నిర్ణయంగా చెబుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో గుడ్డును అనేది విశేషంగా సహాయపడుతుందని తెలిపారు. కానీ అధికంగా గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 1-2 గుడ్లు తినడం సురక్షితం అని వైద్య నిపుణులు తెలిపారు. అయితే వ్యక్తి వయస్సు, శారీరక శ్రమ, ఆరోగ్య స్థితిపై ఆయన తినాల్సిన గుడ్ల సంఖ్య ఆధారపడి ఉంటుందన్నారు. ఉదాహరణకు, ఎక్కువ ప్రోటీన్ అవసరమయ్యే అథ్లెట్లు లేదా బాడీబిల్డర్లు, డైటీషియన్ సలహా మేరకు 3-4 గుడ్లు తినవచ్చని సూచించారు.
గుడ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..
ఒక గుడ్డులో సుమారుగా 6-7 గ్రాముల ప్రోటీన్, విటమిన్ బి12 , విటమిన్ డి, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ.. గుడ్లలలో ఉండే ప్రోటీన్లు.. కండరాలను నిర్మించడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే గుడ్డులో ఉండే కోలిన్ మెదడు ఆరోగ్యానికి చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.
ఎక్కువగా గుడ్లు తింటే కలిగే నష్టాలు ఇవే..
ఏదైనా ఒక లిమిట్‌లో తీసుకుంటేనే మంచిది. అలా కాదని ఎక్కువగా తీసుకుంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. అలాగే గుడ్లను కూడా లిమిట్‌లో తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ఆరోగ్యానికి ఎంత మంచివైనా, వాటిని ఎక్కువగా తింటే.. దాని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని, అందుకని వీటిని ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. శరీరంలో పెరిగే కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఎక్కువగా గుడ్లు తింటే ప్రమాదం అని వెల్లడించారు. అందుకే దేనినైనా లిమిట్‌లో తీసుకోవాలని సూచించారు.