Health Tips : ఆకలి వేయడం లేదా? ఈ లక్షణాలను లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం!

శరీరానికి శక్తి కావాలన్నా, అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా సరైన ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం.

Update: 2026-02-13 13:35 GMT

Health Tips : ఆకలి వేయడం లేదా? ఈ లక్షణాలను లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం!

Health Tips : శరీరానికి శక్తి కావాలన్నా, అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా సరైన ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. అయితే, ఈ మధ్య కాలంలో చాలామందిలో కనిపిస్తున్న ప్రధాన సమస్య ‘ఆకలి లేకపోవడం’. పని ఒత్తిడి అనో, వాతావరణం బాలేదనో దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఆకలి తగ్గడం అనేది మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉందనడానికి సంకేతమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకలి తగ్గడం ఏ వాధ్యులకు సంకేతం, అసలు ఆకలి ఎందుకు తగ్గినట్లు అనిపిస్తుందో ఈస్టోరీలో తెలుసుకుందాం.

సమయానికి ఆహారం తీసుకోకపోతే కేవలం కడుపు ఖాళీగా ఉండటమే కాదు, శరీరం లోపల అనేక మార్పులు చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

* నిరంతర బలహీనత, తల తిరగడం.

* పనిపై ఏకాగ్రత తగ్గడం, విపరీతమైన చిరాకు.

* రోగనిరోధక శక్తి క్షీణించి, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడటం.

* చర్మం నిస్తేజంగా మారడం, జుట్టు రాలడం, నిద్రలేమి.

ఆకలి తగ్గడం ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు!

ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. నిరంతరం ఆకలి వేయకపోవడానికి వెనుక కొన్ని తీవ్రమైన వైద్య సమస్యలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

* జీర్ణకోశ సమస్యలు: గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరం (Bloating) వల్ల ఆహారం పట్ల విరక్తి కలుగుతుంది.

* థైరాయిడ్ రుగ్మతలు: శరీర జీవక్రియను (Metabolism) నియంత్రించే థైరాయిడ్ గ్రంథిలో లోపాలు ఆకలిని దెబ్బతీస్తాయి.

* కాలేయం & మూత్రపిండాల వ్యాధులు: లివర్ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు శరీరంలో టాక్సిన్స్ పెరిగి ఆకలి మందగిస్తుంది.

* రక్తహీనత (Anemia): శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైన అలసట వల్ల తినాలనే కోరిక తగ్గుతుంది.

* మానసిక స్థితి: ఒత్తిడి, ఆందోళన (Anxiety), డిప్రెషన్ వంటివి మెదడులోని ఆకలిని ప్రేరేపించే కేంద్రాలను అణచివేస్తాయి.

ఇలా చేయండి..

* ఆరోగ్యకరమైన ఆకలిని తిరిగి పొందడానికి మీ జీవనశైలిలో ఈ చిన్న మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు..

* ఒకేసారి ఎక్కువ తినకుండా, రోజులో 4-5 సార్లు తక్కువ మొత్తంలో పోషకాహారం తీసుకోవాలి.

* డీహైడ్రేషన్ వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కాబట్టి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.

* ప్రతిరోజూ 20 నిమిషాల నడక లేదా యోగా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి పెరుగుతుంది.

* నూనెలో వేయించిన పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహారానికి దూరంగా ఉండండి.

ఆకలి లేకపోవడం 2-3 వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరించారు. వేగంగా బరువు తగ్గిపోవడం, ఆహారం చూస్తేనే వాంతులు వచ్చినట్లు అనిపించడం, విపరీతమైన నీరసం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు మీలో కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు.

Tags:    

Similar News