Kiss Day special: ఒక్క కిస్‌తో.. ఎన్ని బెఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్ కావాల్సిందే!
ప్రేమగా ఇచ్చే ఒక చిన్న ముద్దుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే కచ్చితంగా షాక్ కావాల్సిందే.
Kiss Day special: ఒక్క కిస్‌తో.. ఎన్ని బెఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్ కావాల్సిందే!
ప్రేమగా ఇచ్చే ఒక చిన్న ముద్దుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే కచ్చితంగా షాక్ కావాల్సిందే. నిజానికి ప్రేమను పంచడంలో కాకుండా, ఆరోగ్యాన్ని పెంచడంలోనూ ముద్దు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న ముద్దుతో మీ ఒత్తిడి తగ్గడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో సుమారు 34 ముఖ కండరాలు, 112 భంగిమ కండరాలు ఉత్తేజితం అవుతాయని, దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలను, కిస్ డే రోజున ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న కిస్ డే జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున.. ప్రేమికులు వారి భావాలను, ప్రేమను ముద్దు పెట్టుకోవడం ద్వారా ఒకరికిఒకరు వ్యక్తపరుచుకుంటారు. కానీ ముద్దు అనేది కేవలం ప్రేమకు మాత్రమే చిహ్నంగా కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని పలు నిపుణులు చెబుతున్నారు. ముద్దు మన హార్మోన్లు, మానసిక స్థితి, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఈ అంశంపై పరిశోధనలు, అధ్యయనాలు చేసిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకున్నప్పుడు, వారి శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ వంటి ఫీల్-గుడ్ హార్మోన్లు రిలీజ్ అవుతాయని, ఇవి ఒత్తిడిని తగ్గించడంలో విశేషంగా సహాయపడతాయని చెబుతున్నారు. అందువల్ల ముద్దు ఇద్దరు వ్యక్తులను దగ్గర చేయడమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుందంటున్నారు.
ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
* ముద్దు పెట్టుకున్నప్పుడు మెదడులో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ వంటి 'ఫీల్ గుడ్' హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచడంతో పాటు, అదే సమయంలో ఒత్తిడిని కలిగించే 'కార్టిసోల్' స్థాయిలను కూడా తగ్గిస్తాయి.
* ముద్దు పెట్టుకోవడం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి (Dilate). దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా సాగి, అధిక రక్తపోటు (Blood Pressure) తగ్గడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
* ముద్దు వల్ల భాగస్వాముల మధ్య లాలాజలం (Saliva) మార్పిడి జరుగుతుంది. ఇది కొత్త రకమైన బ్యాక్టీరియాను శరీరానికి పరిచయం చేస్తుంది. దీనివల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ (Immune System) మరింత బలోపేతం అవుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
* ముద్దు పెట్టుకునే సమయంలో ముఖంలోని అనేక కండరాలు కదులుతాయి. ఇది ఒక రకమైన 'ఫేషియల్ ఎక్సర్‌సైజ్' లా పనిచేస్తుంది. దీనివల్ల ముఖంలో రక్త ప్రసరణ పెరిగి, చర్మం బిగుతుగా మారి యవ్వనంగా కనిపిస్తారు.
* ఒక నిమిషం పాటు ముద్దు పెట్టుకోవడం వల్ల సుమారు 2 నుంచి 6 కేలరీలు ఖర్చవుతాయి. ఇది జిమ్ వర్కౌట్‌తో సమానం కాకపోయినా, జీవక్రియను (Metabolism) మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
గమనిక: ముద్దు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నోటి పరిశుభ్రత (Oral Hygiene) పాటించకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త. దంత సమస్యలు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్న వారు కిస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.