Health Tips: టిఫిన్‌ విషయంలో ఈ తప్పు చేయవద్దు.. లేదంటే ఆస్పత్రికే..!

Health Tips: ఉదయంపూట టిఫిన్‌ అనేది రోజులో మొదటి భోజనం.

Update: 2023-03-26 01:30 GMT

Health Tips: టిఫిన్‌ విషయంలో ఈ తప్పు చేయవద్దు.. లేదంటే ఆస్పత్రికే..!

Health Tips: ఉదయంపూట టిఫిన్‌ అనేది రోజులో మొదటి భోజనం. దీనిని కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు రోజుని మంచిగా ప్రారంభించాలంటే ఆరోగ్యకరమైన, పోషకమైన టిఫిన్‌ తినాలి. ఇది రోజువారీ పనిచేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. కానీ కొందరు టిఫిన్‌ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. వీటివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతే కాదు ఈ పొరపాట్ల వల్ల మధుమేహం, బీపీ వంటి వ్యాధులు సంభవిస్తాయి. అల్పాహారం తీసుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

ప్రోటీన్ లేకపోవడం

మనలో చాలామంది టిఫిన్‌లో శరీరానికి హాని కలిగించే ఆహారాలని చేర్చుకుంటారు. వీటిని చేర్చుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. కానీ ఇలాంటి టిఫిన్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందులో ప్రొటీన్‌ని చేర్చుకోవడం వల్ల ఇది కండరాల అభివృద్ధిలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

పీచు లేకపోవడం

ఉదయం అల్పాహారంలో పీచుపదార్థాన్ని చేర్చకపోతే మలబద్దక సమస్య ఎదురవుతుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ తప్పనిసరిగా ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో పీచుపదార్థాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. జీర్ణశక్తి బలంగా తయారవుతుంది. మలబద్దక సమస్య ఉండదు.

ప్యాక్డ్ జ్యూస్

బ్రేక్‌ఫాస్ట్‌లో ప్యాక్ చేసిన జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది బరువుని విపరీతంగా పెంచుతుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కాబట్టి ప్యాక్ చేసిన జ్యూస్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకూడదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News