Alcohol Danger Alert: పెగ్గు మీద పెగ్గు తాగుతున్నారా..? ఒక్కసారి పెగ్గు ఎక్కువ తాగితే యమలోకం టికెట్ బుక్!
Alcohol Danger Alert: మద్యానికి అలవాటు పడినవారికి డేంజర్ అలర్ట్: “బింజ్ డ్రింకింగ్” వల్ల పేగులు, కాలేయం సీరియస్ డ్యామేజ్!
Alcohol Danger Alert: పెగ్గు మీద పెగ్గు తాగుతున్నారా..? ఒక్కసారి పెగ్గు ఎక్కువ తాగితే యమలోకం టికెట్ బుక్!
Alcohol Danger Alert: హార్వర్డ్ మెడికల్ స్కూల్ తాజా అధ్యయనంలో తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తాగడం వల్ల కలిగే ప్రమాదాలను వెల్లడించింది. పెద్దవారితో పాటు 15 ఏళ్లు దాటిన చిన్నవాళ్లలో కూడా మద్యం అధికంగా తీసుకోవడం పెరుగుతున్న పరిస్థితులు గుర్తించారు.
పెద్ద మొత్తంలో మద్యం తీసుకోవడం వల్ల పేగుల రక్షణ పొర (Gut lining) బలహీనపడుతుంది, చిన్న చీలికలు ఏర్పడతాయి. దీన్ని “లీకీ గట్” అంటారు. ఫలితంగా రక్తంలో విషపదార్థాలు చేరి శరీరంలో వాపులు, జీర్ణ సమస్యలు, కాలేయ వ్యాధులు మొదలవుతాయి.
అధిక మద్యం వల్ల రోగనిరోధక కణాలు (Neutrophils) అసమతుల్యంగా పనిచేస్తాయి. ఇవి NETs అనే వలలు విడుదల చేస్తాయి, పేగు గోడను మరింత దెబ్బతీస్తాయి. చివరిసారి మద్యం తాగిన తర్వాత కూడా పేగుల నష్టం కొంతకాలం కొనసాగుతుంది.
విజ్ఞానులు సూచించినట్టే, మద్యం పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం అత్యంత అవసరం, లేకపోతే శరీరానికి దీర్ఘకాలిక నష్టం తప్పదు.