WHO On Corona Pandemic: వామ్మో కరోనా ప్రభావం పదేళ్ళ పాటు ఉంటుందట.. ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబ్!

WHO On Corona Pandemic: చైనాలోని వ్యూహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే కరోనా వలన

Update: 2020-08-01 07:08 GMT
Adhanom Ghebreyesus (File photo)

WHO On Corona Pandemic: చైనాలోని వ్యూహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే కరోనా వలన చాలా మంది చనిపోయారు. అయితే ఈ వ్యాప్తి మొదలై ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ టీమ్ శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యింది. ఈ సమీక్షలో మొత్తం 30 మంది పాల్గొన్నారు. ఈ సమీక్షలో శానిటైజర్ల వాడకం, మాస్క్‌‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ సంస్థకు కొన్ని సిఫార్సులను జారీ చేసింది.

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉండనుందని అంచనా వేశారు. ఇక కరోనా వలన చాలా మందికి ముప్పు పొంచి ఉందని, ఇక ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందని అన్నారు. ఇక కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయని, వాటి ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతుందని అయన వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. మహమ్మారి తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశాల్లో మరోసారి వైరస్ విజృంభిస్తోందని అధ్నామ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఇక గతేడాది డిసెంబరు చివర్లో చైనా దేశంలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ మొదలైంది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1.77 కోట్ల మందికి సోకగా, 6.83 లక్షల మంది చనిపోయారు. అత్యధిక కేసులలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అక్కడ 47 లక్షల మందికి వైరస్ నిర్దారణ కాగా.. 1.56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనికి వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో ప్రపంచ శాస్త్రవేత్తలు నిమగ్నం అయి ఉన్నారు.

Tags:    

Similar News