B-2 Bombers: ఇరాన్‌పై దాడుల డోస్ పెంచిన అమెరికా.. రంగంలోకి బీ-2 బాంబర్లు..
B-2 Bombers: ఇరాన్‌పై అమెరికా దాడుల డోస్ పెంచింది. ఇరాన్‌పై అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లను ప్రయోగిస్తోంది.
B-2 Bombers: ఇరాన్‌పై దాడుల డోస్ పెంచిన అమెరికా.. రంగంలోకి బీ-2 బాంబర్లు..
B-2 Bombers: ఇరాన్‌పై అమెరికా దాడుల డోస్ పెంచింది. ఇరాన్‌పై అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లను ప్రయోగిస్తోంది. బాలిస్టిక్ మిస్సైల్ లాంఛర్లే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది. ఇరాన్ నేవీని టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతోంది. బాలిస్టిక్ మిసైల్ లాంఛర్లే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది.
అమెరికా వైమానిక దళానికి చెందిన B-2 స్టెల్త్ బాంబర్లు ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఉపయోగించాయని.. యూనిటెడ్ స్టేట్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఈ బాంబర్లు అమెరికాలోని వైట్‌మాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి చేసినట్లుగా తెలిపింది. ఈ దాడుల్లో గగనతలంలో ఇంధనం నింపుకునే విధానం కూడా ఉపయోగించినట్లు పేర్కొంది. మిస్సోరీ రాష్ట్రంలో ఉన్న వైట్‌మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రస్తుతం B-2 స్టెల్త్ బాంబర్లకు ఏకైక కార్యాచరణ కేంద్రంగా ఉంది.
B-2 స్టెల్త్ బాంబర్లను 2022లో అధికారికంగా ఆవిష్కరించారు. అణు, సాధారణ ఆయుధాలను మోసుకెళ్లగలదు. అవసరమైతే సిబ్బంది లేకుండానే పనిచేసే సామర్థ్యం కూడా దీనికి ఉంటుందని అధికారులు తెలిపారు. B-2 బాంబర్లు ఇరాన్ అణు స్థావరాలపై 30,000 పౌండ్ల బరువైన బంకర్ బస్టర్ బాంబులను వదిలినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. భూమి లోతుల్లో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఇవి ఉపయోగిస్తారు. B-2 తర్వాత అత్యంత శక్తివంతమైన B-21 రైడర్ బాంబర్ 2027 నాటికి సేవల్లోకి వచ్చే అవకాశం ఉందని యూనైటెడ్ స్టేట్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది.