Middle East Crisis: ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా
Middle East Crisis: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిసైళ్లతో దాడి చేస్తుండగా.. మరోవైపు అమెరికా ఇరాన్ యుద్ధనౌకలను పేల్చేస్తోంది.
Middle East Crisis: ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా
Middle East Crisis: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిసైళ్లతో దాడి చేస్తుండగా.. మరోవైపు అమెరికా ఇరాన్ యుద్ధనౌకలను పేల్చేస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కాస్తా... ఇరాన్ అమెరికా యుద్ధంగా మారిపోయింది. తాజాగా ఇరాన్ యుద్ధనౌకను శ్రీలంక తీరంలో అమెరికా పేల్చేసింది. ఇరాన్‌కు చెందిన I.R.I.S దేనా అనే యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి టార్పెడోతో దాడి చేసి ముంచివేసింది. ఈ ఘటనలో 87 మంది ఇరాన్ నావికా సిబ్బంది మరణించగా, మరో 32 మందిని శ్రీలంక నేవీ సిబ్బంది రక్షించారు. ఈ దాడికి తామే బాధ్యులమని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది. దాడికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది.
ఇరాన్ నౌక నుంచి అందిన అత్యవసర సమాచారంతో శ్రీలంక నౌకాదళం రంగంలోకి దిగింది. గాలింపు చర్యలు చేపట్టగా, ఘటనా స్థలంలో నౌక పూర్తిగా మునిగిపోయిందని, కేవలం ఆయిల్ మరకలు, లైఫ్ జాకెట్లు మాత్రమే కనిపించాయని శ్రీలంక నౌకాదళం వెల్లడించింది. నీటిలో తేలియాడుతున్న సిబ్బందిని గుర్తించి 32 మందిని రక్షించామని, 87 మృతదేహాలను వెలికితీశామని తెలిపింది. రక్షించిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో కొంతమందికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది.