బహ్రెయిన్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ల వర్షం.. బదులుగా ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా!

Middle East War Updates: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సైన్యం చేస్తున్న దాడుల్లో ఇరాన్‌ దేశం రక్తమోడుతోంది.

Update: 2026-03-06 06:05 GMT

బహ్రెయిన్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ల వర్షం.. బదులుగా ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా!

Middle East War Updates: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సైన్యం చేస్తున్న దాడుల్లో ఇరాన్‌ దేశం రక్తమోడుతోంది. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 12 వందల 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా ఇరాన్‌ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. అమెరికా తమపై విరుచుకుపడుతుంటే.. ఇరాన్‌‌ గల్ఫ్‌ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. తాజాగా

బహ్రెయిన్‌ సిత్రా ఐలాండ్‌కు సమీపంలోని ఆయిల్ రిఫైనరీపై ఇరాన్‌ సైన్యం విరుచుకుపడింది. 123 డ్రోన్లు, మిస్సైల్స్‌తో భీకర దాడి చేసింది. ఈ దాడితో ఆయిల్ రిఫైనరీ మంటల్లో దగ్ధమైపోయింది. మరోవైపు హోటల్స్‌పైనా ఇరాన్ దాడులు చేసింది. రాజధాని మనామాలోని హోటల్‌తో పాటు రెండు రెసిడెన్షియల్ బిల్డింగ్‌లపై ఇరాన్ దాడిచేసినట్టు అక్కడి అధికార వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు ఇరాన్‌ నేవీని లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు దిగింది. కోస్ట్ ఆఫ్‌ బందర్ అబ్బాస్‌లోని ఐరిస్ షాహిద్‌ బఘేరిపై B-2 బాంబర్లతో అమెరికా దాడులు చేసింది. డ్రోన్‌ క్యారియర్‌ షిప్‌గా ఐరిస్ షాహిద్ బఘేరిని IRGC వినియోగిస్తుండటంతో.. ఆ షిప్‌ను టార్గెట్ చేసింది యూఎస్‌. ఈ దాడితో ఐరిస్ బఘేరి మంటల్లో చిక్కుకుపోయింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ డ్రోన్ క్యారియర్‌ మునిగిందంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

Tags:    

Similar News