Donald Trump: విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

Donald Trump: అమెరికాలో ఉన్నత విద్య కోసం చదువుతున్నవారికి, అక్కడికి వెళ్లేందుకు యత్నిస్తున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది.

Update: 2025-08-28 06:29 GMT

Donald Trump: విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

Donald Trump: అమెరికాలో ఉన్నత విద్య కోసం చదువుతున్నవారికి, అక్కడికి వెళ్లేందుకు యత్నిస్తున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే వీసాలపై అనేక ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా, తాజాగా వీసాల గడువు పరిమితిపై కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులు అమెరికాలో దీర్ఘకాలం ఉండకుండా నియంత్రించేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ యోచిస్తోంది. ప్రస్తుతం ఎఫ్‌-1 (F-1), జే-1 (J-1) వీసాల ద్వారా విద్యార్థులు కోర్సు పూర్తయ్యేంతవరకు దేశంలో ఉండే వెసులుబాటు ఉంది. దీనిని తొలగించి, వాటికి గరిష్ఠ గడువు విధించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.

ప్రధాన ప్రతిపాదనలు:

ఎఫ్‌-1, జే-1 వీసాదారులకు గరిష్ఠ గడువు నాలుగేళ్లుగా పరిమితం చేయడం.

గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్న విద్యార్థులు కోర్సు మారిస్తే, అదనపు ఆంక్షలు విధించే అవకాశం.

ఎఫ్‌-1 వీసాదారుల కోసం వీసా మార్పులు చేసుకునే గోల్డెన్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకే కుదింపు.

ఐ వీసాదారులకు (ముద్రిత & మీడియా ప్రతినిధులు) 240 రోజుల గడువు, తరువాత అదే కాలానికి మరోసారి పొడిగించుకునే అవకాశం. చైనా మీడియా ప్రతినిధులపై ప్రత్యేక ఆంక్షలు.

ఈ ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించి, ప్రజాభిప్రాయాలను స్వీకరించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, పబ్లిక్ కామెంట్లను పక్కన పెట్టి తక్షణ అమలుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశమూ ఉందని సమాచారం.

ఈ మార్పులు అమలులోకి వస్తే, ప్రస్తుతం అమెరికాలో ఉన్న 3.3 లక్షల భారతీయ విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News