త్వరలోనే ముగియనున్న యుద్ధం.. పుతిన్‌తో ట్రంప్ గంటపాటు సంచలన చర్చలు!
Donald Trump: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే ముగియనున్న యుద్ధం.. పుతిన్‌తో ట్రంప్ గంటపాటు సంచలన చర్చలు!
Donald Trump: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటసేపు ఫోన్‌లో కీలక అంశాలపై చర్చించారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు పుతిన్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు రష్యా అధికార వర్గాలు వెల్లడించింది.
వాషింగ్టన్ చొరవతో జరిగిన ఈ చర్చల్లో యుద్ధాన్ని దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోటంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపింది. గతంలో అంచనా వేసిన నాలుగైదు వారాల కన్నా ముందే ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్‌కు ఇప్పుడు నేవీ, ఎయిర్‌ఫోర్స్, కమ్యూనికేషన్లు లేవని, వారి క్షిపణులు చెల్లాచెదురుగా పడుతున్నాయని తెలిపారు.