విమానాన్ని దొంగిలించిన పైలెట్.. వాల్‌మార్ట్‌పై కూలుస్తానంటూ వార్నింగ్‌

US Pilot: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన చోటుచేసుకుంది.

Update: 2022-09-03 15:15 GMT

విమానాన్ని దొంగిలించిన పైలెట్.. వాల్‌మార్ట్‌పై కూలుస్తానంటూ వార్నింగ్‌

US Pilot: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో ఓ పైలెట్‌ విమానాన్ని దొంగిలించాడు. వాల్‌మార్ట్‌పై విమానాన్ని కూలుస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. దాదాపు గంట సేపటి నుంచి స్టోర్‌ పరిసరాల్లో విమానం చక్కర్లు కొడుతున్నది. దీంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు వాల్‌మార్ట్‌ను ఖాళీ చేయించారు. వాల్‌మార్ట్‌ పరిసరాల్లోకి ఎవరూ రావొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే వాల్‌మార్ట్‌ను ఢీకొడుతానని పైలెట్‌ హెచ్చరిస్తుండగా ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.


Tags:    

Similar News