Pakistan: దుర్భర పరిస్థితుల్లో పాకిస్థాన్.. కీలక నిర్ణయం తీసుకున్న దేశం.
Pakistan: పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం మార్చి 23న జరిగే రిపబ్లిక్ డే వేడుకలు రద్దు చేసింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ కార్యాలయం వెల్లడించింది. ఇస్లామాబాద్‌లో జరిగే భారీ సైనిక పరేడ్ ఈసారి ఉండదు.

మధ్యప్రాచ్య యుద్ధం ప్రభావం
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల తర్వాత గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.
చమురు సరఫరా అంతరాయం
ఇరాన్–ఒమాన్ మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి ప్రపంచానికి చాలా కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు, సముద్ర మార్గంలో రవాణా అయ్యే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో సుమారు నాలుగో వంతు ఈ మార్గం గుండా వెళ్తాయి. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ మార్గంలో రవాణా అంతరాయం ఏర్పడింది. దీంతో చమురు సరఫరా తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్‌లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.
ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం మార్చి 23ను రిపబ్లిక్ డేగా ఘనంగా నిర్వహిస్తారు. ఇస్లామాబాద్‌లో 31 తుపాకీ గౌరవ వందనం, రాష్ట్ర రాజధానుల్లో 21 తుపాకీ గౌరవ వందనం ఇవ్వడం సంప్రదాయం. ఆ తర్వాత సైన్యానికి చెందిన భారీ పరేడ్ నిర్వహిస్తారు. ఇందులో సైనిక దళాలు, ట్యాంకులు, యుద్ధ సామగ్రి ప్రదర్శనలు జరుగుతాయి.
ఈసారి వేడుకలకు దూరంగా
ఈసారి మాత్రం ఆడంబరాలన్నీ తగ్గించి సాధారణంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. దేశవ్యాప్తంగా అవసరమైన స్థాయిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి.
దేశ గౌరవం, పాకిస్తాన్ డే ప్రాముఖ్యత మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.
ఇంధన సంక్షోభం కారణంగా కఠిన నిర్ణయాలు
ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రోజుల పని విధానం, 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడం, అధికార వాహనాలకు ఇంధన అలవెన్స్ తగ్గించడం, ప్రభుత్వ వాహనాల్లో 60 శాతం వినియోగం నిలిపివేయడం
ఇంధనాన్ని ఆదా చేయడానికి పాఠశాలలను రెండు వారాలు మూసివేయడం వంటి చర్యలు తీసుకుంది.