Russia-Ukraine Crisis: రష్యా దాడిలో ఏడుగురు ఉక్రెనియన్లు మృతి
Russia Ukraine War Death Count: ఉక్రెయిన్ సరిహద్దులోని నగరాలు దద్దరిల్లుతున్నాయి.
Russia-Ukraine Crisis: రష్యా దాడిలో ఏడుగురు ఉక్రెనియన్లు మృతి
Russia Ukraine War Death Count: ఉక్రెయిన్ సరిహద్దులోని నగరాలు దద్దరిల్లుతున్నాయి. రష్యా సైన్యం దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలైనట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఎదురు దాడుల్లో రష్యాకు చెందిన 50 మంది ఆక్రమణదారులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు రష్యా సైన్యం వేర్వేరు ప్రాంతాల్లో ఉక్రెయిన్‌లోకి ప్రవేశించింది.
క్రిమియన్ సరిహద్దులో రష్యా దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ బార్డర్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. రష్యాకు చెందిన 5 విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చేసినట్టు ఆర్మీ జనరల్ స్టాఫ్ తెలిపింది. కీవ్, ఖార్కోవ్, డ్నియీపర్‌లోని మిలటరీ హెడ్ క్వార్టర్స్, మిలటరీ గిడ్డంగులు, ఎయిర్ పోర్టులపై రష్యా మిసైల్ దాడి చేసినట్టు ఉక్రెయిన్ మంత్రి ఆంటన్ గెరష్చెన్‌కో తెలిపారు. అయితే ఉక్రెయిన్‌లోని ఎయిర్ బేస్, ఎయిర్ డిఫెన్స్‌పై దాడులు చేసినట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే తమ సైన్యం ప్రాణ నష్టాన్ని మాత్రం వివరించలేదు.